అక్షరాలోచన

వానపాములు మిన్న?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హక్కులెన్ని ఉన్నా
ప్రశ్నించే సత్తాలేనివాళ్లం
నోటుకు ఓటును
అమ్ముకొనే దౌర్భాగ్యులం
వాక్ స్వాతంత్య్రమున్నా
ఉబుసుపోని కబుర్లే చెప్పుకొంటాం
జీవించే హక్కున్నా
చచ్చి బ్రతుకుతుంటాం
హక్కు దక్కించుకోం
దోచేవాడ్ని ప్రశ్నించం
వానపాము నయం
ఉంటుంది ఎంతో కొంత చలనం
నాయకులు లక్షల కోట్లు దోచేస్తున్నా
మనది మన్నుతిన్న పాము చందం
అన్నం పెట్టే రైతన్నకు
ఆత్మహత్య బహుమతి
మోసం చేసే నాయకులకు
పదవులు, కోట్లు బహుమతి
బట్టలిచ్చే చేనేతన్నకు
ఉరితాడు బహుమానం
దౌర్జన్యం చేసే రౌడీలకు
సీట్‌లు, ఫండ్‌లు బహుమానం
హతవిథీ!
ఏమిటీ దౌర్భాగ్యం?
తల్లి భారతికి
ఏమిటీ దుస్థితి?
ఇక ఆపుదాం, అడ్డుకొందాం
ప్రశ్నిద్దాం, నిలదీద్దాం
ఓటుకు నోటు కాదు
అడుగుదాం రోడ్డు
రోడ్డు పేరుతో తినే
లంచాల్ని అడ్డుకొందాం
కాంట్రాక్టర్ దిగమింగే
సిమెంటుకు అడ్డుపడదాం
రైతుకు గిట్టుబాటు ధర
చేనేతకు తగిన విలువ
ఏ కష్టానికైనా సరైన ఫలితం
ఏ వర్గానికైనా సమన్యాయం
అడుగుదాం అన్నీ
దక్కించుకొందాం హక్కుల్ని
వానపాములం కాదు
మన్నుతిన్న పాములం కాదు
పౌరులం మనం
భారతీయ పౌరులం మనం.

- టి.వి.సుబ్రహ్మణ్యేశ్వరరావు 9908893669