ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? ( ఫిబ్రవరి 12 నుండి 18 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

అనుకున్న పనులు నిబద్ధతతో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఫలప్రదమవుతాయి. వృత్తి వ్యాపార, ఉద్యోగ, విద్య, వైద్య రంగాలందు వృద్ధి అవుతుంది. కొన్ని నిర్ణయాలను సమీక్షించుకోవాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ప్రయత్నంపై ఉద్యోగావకాశాలు. దంపతులు ముఖ్యమైన పనులను పూర్తి చేయనున్నారు. స్పెక్యులేషన్‌లో మిశ్రమ ఫలితాలు. స్వీయ పర్యవేక్షణ అన్నింటా మేలు. శుభాలు అందుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

బాధ్యతాపరమైన పనులు చేయవలసి వస్తుంది. పైకం సమయానికి అందుతుంది. ఖర్చు నియంత్రణ మంచిది. విదేశీ ప్రయత్నాలు మెరుగవుతాయి. గత వారం కంటె వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు ఆలోచింపజేస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యూహాత్మకంగా మెలగవలసి వస్తుంది. శుభకార్యాలు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ ఫలప్రదం. విలువైన వస్తువులు ఖరీదు చేసే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు మెరుగవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలసి వస్తాయి. మీ నడవడిక ఎదుటివారిని ఆకట్టుకొంటుంది. వీలువెంట మీరు పనులు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. గొలుసు దొంగల బారిన పడకుండా జాగ్రత్త పడండి. ప్రైవేటు ఉద్యోగాలు ఖాయమవుతాయి. దంపతులకు అనుకోని సంతోషకరమైన సమాచారం అందుతుంది. స్పెక్యులేషన్ గతం కంటె జయప్రదం. విలువైన వస్తువులు జాగ్రత్త. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

బుద్ధి బలంతో, లౌక్యంతో పనులు నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులు సమయానికి సాయపడతారు. విలువైన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు వెళ్లాలి. మానసికంగా సంతోషాన్ని పొందుతారు. అన్ని పనులు అస్తవ్యస్థంగా సాగుతాయి. పరిచయాలు, గౌరవాదులు పెంపొందుతాయి. స్పెక్యులేషన్ మిశ్రమం. అనుకున్న ఇష్టులు వస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

ఏ విషయాన్నైనా తేలికగా చూడకండి. ఆర్తికంగా నిలదొక్కుకుంటారు. ప్రయత్నాలకు స్థితులు అనుకూలిస్తాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. సంప్రదింపులు, వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. శుభకార్యాల్లో మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. విలువైన పత్రాలు, వస్తువులతో జాగ్రత్త. ఆస్తి విషయాలు ఊపందుకుంటాయి. హడావిడిగా పనులు చేయకండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు గతం కంటె బాగుంటాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

శుభకార్యాలు కలసి వస్తాయి. రావలసిన పైకం సమయానుకూలంగా అందుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. అన్నింటా అనుకూలతలు ఉంటాయి. కొన్ని పనులు వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంబంధాలు, అనుబంధాలు మెరుగవుతాయి. స్పెక్యులేషన్ జయప్రదం. బంధుమిత్రుల రాక సంతోషాన్నిస్తుంది. శుభప్రదమవుతుంది. నిరుద్యోగుల కృషి ఫలప్రదం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

పరిశీలనలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అన్నింటా సందేహ నివృత్తి అవుతుంది. ఖర్చులు మామూలుగా ఉంటాయి. పెద్ద మొత్తంలో ధన సాయం మంచిది కాదేమో ఆలోచించండి. మీ ఇష్టాయిష్టాలను తెలియజేయండి. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. మీ ప్రమేయంతో శుభకార్యాలు నిశ్చయించబడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం జాగ్రత్త. స్పెక్యులేషన్ ఫరవాలేదు. చిరుద్యోగులకు మంచి అవకాశాలుంటాయి. పర్యవేక్షణ అన్నింటా మంచిది.
వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

ఐచ్ఛికంగా కొన్ని పనులు మిత్రుల సాయంతో పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం. ఖర్చులు పెరిగినా అంత ఇబ్బంది ఉండదు. చెల్లింపులు, చెక్కుల విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. శుభకార్యాలు మీ ప్రమేయంతో ముందుకు వెళ్తాయి. పనులు హడావిడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తత అవసరం. విశ్రాంతి అవశ్యం. దంపతుల మధ్య దాపరికం కూడదు. కుటుంబ సభ్యుల జయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. స్పెక్యులేషన్ వృద్ధి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

స్థల, గృహ మార్పునకు అవకాశాలు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మిత్రుల సాయంతో శుభకార్య ప్రయత్నాలు కొనసాగిస్తారు. గౌరవం తగ్గకుండా పనులు నిర్వర్తించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, బంగారం వర్తకులు అనుకోని వ్యవహారాలలో తలదూర్చవలసి వస్తుంది. చెప్పుడు మాటలకు విలువ ఇవ్వకండి. ప్రముఖులు, అధికారులతో పరిచయాలు మెరుగవుతాయి. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

సమిష్టి ప్రణాళికలతో పనులు పూర్తి చేస్తారు. అనుకోని పనులు మీ ఆలోచనలతో పూర్తి చేయాల్సి వస్తుంది. అవకాశాలను వినియోగించుకోండి. ఇతరుల సలహాలు తీసుకున్నప్పటికీ మీ ఆలోచనలకు అనుగుణంగానే వెళ్లండి. విద్య, వైద్య, వృత్తి, వ్యాపార రంగాలు మెరుగుతాయి, గతం కంటె కూడా. ఇష్టుల సాయంతో సమస్యలు పరిష్కరించుకుంటారు.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఆదాయ లావాదేవీలు బేరీజు వేసుకోవాల్సి వస్తుంది. మీ హితులకు మీరిచ్చే సలహాలు తృప్తినిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమయ్యే అవకాశముంది. అతి సర్వత్ర వర్జయేత్. ఆలోచనానుగుణంగా ప్రవర్తించండి. అవగాహన లేని వాటిలో తలదూర్చవద్దు. దంపతుల మధ్య అవగాహనా రాహిత్యం లేకుండా చూసుకోండి. మీ హద్దుల్లో మెలగడం మంచిది. స్పెక్యులేషన్ ఫలప్రదం.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

పొదుపు పథకాలు, పెట్టుబడులకు అనుకూలం. ఆదాయ వ్యయాలందు తృప్తి. ఖర్చులు అంత భారమనిపించవు. డబ్బు వ్యవహారాల్లో, మాటల్లో జాగ్రత్త. లౌక్యం అవసరాన్ని బట్టి ప్రదర్శించుకోవాలి. ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలసి వస్తాయి. అవివాహితులకు శుభ వార్తలు, నిశ్చయాలు మెరుగవుతాయి. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855