జాతీయ వార్తలు

డిడిసిఏ అవినీతిని బయటపెట్టి తీరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెయ్యి లీగల్ నోటీసులిచ్చినా భయపడం జైట్లీపై దాడిని తీవ్రం చేసిన ఆప్
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హయాంలో ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఏ)లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ జైట్లీపై తన దాడిని మరింత తీవ్రం చేస్తూ ఆయనకు మరిన్ని ప్రశ్నలు సంధించడమే కాకుండా డిడిసిఏలో అవినీతిపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేసింది. 21 సెంచరీ మీడియా అనే ప్రైవేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లోకేశ్ శర్మ ద్వారా జైట్లీ తనకు, తన సహచరుడు అశుతోష్‌కు లీగల్ నోటీసు పంపించారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ ఆరోపిస్తూ, ఇలాంటి వెయ్యి లీగల్ నోటీసులు పంపించినా ఎదుర్కోవడానికి తాము సిద్ధమేనని, డిడిసిఏలో అవినీతిని బట్టబయలు చేయడానికే తాము కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. కాగా, తనపై ‘ఆప్’ చేసిన ఆరోపణలను జైట్లీ తోసిపుచ్చుతూ ఢిల్లీ సెక్రటేరియట్‌పై సిబిఐ దాడి తర్వాత పీకల్లోతు ఇరుక్కుపోయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రచార టెక్నిక్ ఇదని అన్నారు.
అయితే లీగల్ నోటీసు పంపించడం ద్వారా తనపై వచ్చిన ఆరోపణలను తొక్కి పెట్టడానికి జైట్లీ ప్రయత్నిస్తున్నారని శనివారం విలేఖరులతో మాట్లాడుతూ సంజయ్ సింగ్ అన్నారు. అంతేకాదు డిడిసిఏలో అవినీతికి సంబంధించి దేశవ్యాప్తంగా పలువురినుంచి తమకు పత్రాలు అందుతున్నాయని కూడా ఆయన చెప్పారు. డిడిసిఏల అవినీతికి సంబంధించిన ఫైల్ కోసమే సిబిఐ కేజ్రివాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంపై దాడి చేసిందని ఆరోపించిన ఆప్ జైట్లీ తన మంత్రిపదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుండడం తెలిసిందే.