జాతీయ వార్తలు

ఢిల్లీలో బీజేపీ విజయభేరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జయభేరీ మోగించింది. ఇక్కడ ఏడు లోకసభ స్థానాలు ఉండగా అన్నింటా బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతూ విజయయాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అధికార పార్టీ ఆప్ చతికలపడింది. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సైతం ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మాత్రమే కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చి రెండవ స్థానంలో నిలచింది. కాగా ఆప్ అభ్యర్థి అతిషీ మూడోస్థానంలో ఉండటం గమనార్హం. కాగా కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ సైతం ఒడిపోయారు. ఢిల్లీలో 2014లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఈసారి ఎన్నికల్లోనూ అదే ప్రభంజనం కొనసాగింది.