జాతీయ వార్తలు

ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మోహానియాకు బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మోహానియాకు బెయిల్ లభించింది. ఆయనకు సాకేత్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. గతవారం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న దినేశ్ మోహానియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు 14 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఎమ్మెల్యే ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. నీటి స‌ర‌ఫ‌రా స‌క్ర‌మంగా చేయాల‌ని కోరుతూ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన మ‌హిళ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండా ఆమెను హింసించిన ఘ‌ట‌న‌లో దినేష్ మోహ‌నియాపై ఐపీసీ 306, 506, 509 సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.