జాతీయ వార్తలు

మరో ఆప్‌ ఎమ్మెల్యే అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దిల్లీలో మెహ్రౌలి నియోజకవర్గ ఆప్‌ ఎమ్మెల్యే నరేశ్‌ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పవిత్ర గ్రంథం ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణలతో నరేశ్‌ను పంజాబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. 12 గంటల వ్యవధిలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు అరెస్టయ్యారు. మహిళపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన కొద్ది గంటలకే మెహ్రౌలి నియోజకవర్గ ఎమ్మెల్యే నరేశ్‌ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఆప్‌లో అరెస్టయిన శాసనసభ్యుల సంఖ్య 11కు చేరింది. దిల్లీలో ఓటమిని తట్టుకోలేని భాజపా ఇలా ప్రతీకారం తీర్చుకుంటుందంటూ ప్రధాని మోదీపై వరుస ట్వీట్లతో ఆప్‌ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా మండిపడ్డారు.