ఆంధ్రప్రదేశ్‌

కలెక్టరేట్ ముట్టడిలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భారీగా ఆశా వర్కర్ల అరెస్టులు
విశాఖపట్నం, డిసెంబర్ 4: ఆశా వర్కర్లు శుక్రవారం విశాఖలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నాన్ని పోలీసులు విఫలం చేశారు. కనీస వేతనం అమలు చేయాలంటూ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా అక్కడికి చేరుకున్న ఆశా వర్కర్లు రోడ్డుమీదనే బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఇదే సమయంలో విశాఖ ఉత్సవ్‌పై సమీక్షను పూర్తిచేసుకున్న మంత్రి శ్రీనివాసరావు బయటకు రావడాన్ని గమనించిన నిరసనకారులు కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్ద అడ్డుతగిలారు. అప్పటికే మొహరించిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన ఆశా వర్కర్లకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగి తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. దీంతో పోలీసులు దొరికిన వారిని దొరికినట్టు అరెస్టు చేశారు. ఈ క్రమంలో కొందరు ఆశా వర్కర్లకు స్వల్పగాయాలయ్యాయి.