ఆటాపోటీ

ఇంజనీర్ ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికెట్‌కీపింగ్‌లోనే కాదు... బ్యాటింగ్‌లోనూ ప్రతిభావంతుడిగా ఫరూఖ్ ఇంజనీర్‌కు మంచి పేరు ఉంది. లాంకషైర్‌కు ప్రాతినిథ్యం వహించిన అతను 164 మ్యాచ్‌లు (249 ఇన్నింగ్స్) ఆడి 5,549 పరుగులు సాధించాడు. ఇంగ్లీష్ కౌంటీల్లో భారత్ తరఫున ఇదే అత్యధిక స్కోరు. రెండో స్థానాన్ని రవి శాస్ర్తీ ఆక్రమించడం విశేషం. అతను 60 మ్యాచ్‌లు (95 ఇన్నింగ్స్)లో 3,296 పరుగులు చేశాడు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 82 మ్యాచ్‌లు (142 ఇన్నింగ్స్‌లో)లో 2874 పరుగులు చేసి, ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. మహమ్మద్ అజరుద్దీన్ 29 మ్యాచ్‌ల్లో 2,485, నవాబ్ ఆఫ్ పటౌడీ సీనియర్ 33 బంతుల్లో 2,380, కపిల్ దేవ్ 40 మ్యాచ్‌ల్లో 2,380 చొప్పున పరుగులు చేసి, కౌంటీల్లో రెండు వేల పరుగుల మైలురాయిని అధిగమించిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
మ్యాచ్‌ల శతకాలు!
ఇంగ్లీష్ కౌంటీల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెటర్ ఫరూఖ్ ఇంజనీర్. వికెట్‌కీపర్/ బ్యాట్స్‌మన్‌గా పేరుప్రఖ్యాతులు సంపాదించిన అతను 1968-1976 మధ్యకాలంలో లాంకషైర్ తరఫున 164 మ్యాచ్‌లు ఆడాడు. ఈ జాబితాలో బిషన్ సింగ్ బేడీ కూడా స్థానం దక్కించుకున్నాడు. అతను 1972-1977 మధ్యకాలంలో నార్తాంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహించి 102 మ్యాచ్‌లు ఆడాడు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 82, దిలీప్ దోషి 73, మురళీ కార్తిక్ 60, రవిశాస్ర్తీ 60 చొప్పున మ్యాచ్‌ల్లో ఆడారు.