ఆటాపోటీ

వకార్‌తోనే నష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ వ్యవహార శైలి కారణంగానే ఆటగాళ్ల మధ్య విభేదాలు తలెత్తాయా? పాక్ జట్టు వరుస పరాజయాలకు, వైఫల్యాలకు వకార్ కారణమా? అవుననే అంటున్నారు పలువురు మాజీ క్రికెటర్లు. ఆసియా కప్, టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాక్ దారుణ వైఫల్యాలకు వకారే బాధ్యుడని స్పష్టం చేస్తున్నారు. జట్టు వైఫల్యాలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి సమర్పించిన నివేదికలో వకార్ పలు సంచలన వ్యాఖ్యాలు చేశాడు. సీనియర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారిలో ఎవరికీ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నామన్న ఆలోచనే లేదని విమర్శించాడు. కెప్టెన్ షహీద్ అఫ్రిదీ ఈ రెండు టోర్నీలను చాలా తేలిగ్గా తీసుకున్నాడని అన్నాడు. చిరకాల ప్రత్యర్థి భారత్‌తో మ్యాచ్‌లకు ముందు కూడా అతను ఏమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని ఆరోపించాడు. కాగా, వకార్ నివేదికపై ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్, మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తదితరులు మండిపడుతున్నారు. జట్టు వైఫల్యాలకు వకారే కారణమని రజాక్ విమర్శించాడు. అతను జట్టును తన ఇష్టాయిష్టాల ప్రకారం నడిపించాడని, ఫలితంగా ఆటగాళ్లు నిరాశచెందారని అన్నాడు. జట్టులో స్థానం ఉంటుందో లేదో అన్న అనుమానం కలిగించి, ఆటగాళ్లలో అభద్రతా భావాన్ని పెంచాడని చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో, మైదానంలో వకార్ తీరు విచిత్రంగా ఉండేదని, ఎన్నడూ అతను ఆటగాళ్లకు చేరువయ్యేందుకు ప్రయత్నించలేదని ధ్వజమెత్తాడు. జట్టు వైఫల్యాలకు ఆటగాళ్లను నిందించే ముందు తనను తాను ప్రశ్నించుకోవాలని వకార్‌కు అక్తర్ సూచించాడు. జట్టు ఆత్మవిశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీసి, అన్ని విధాలా నాశనం చేసిన వకార్ ఎదురుదాడికి దిగడం విచిత్రంగా ఉందని అన్నాడు. కోచ్‌గా వకార్ చేసిందేమీ లేదని, పైగా జట్టులో నాణ్యతా ప్రమాణాలు దారుణంగా పడిపోవడానికి కారణమయ్యాడని పేర్కొన్నాడు. మొత్తం మీద మాజీ క్రికెటర్ల మధ్య మాటల తూటాలు పేలుతుండగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) తాజాగా తీసుకున్న నిర్ణయం కూడా విమర్శలకు కారణమైంది. పాక్ క్రికెట్‌కు సలహాదారులుగా మిస్బా ఉల్ హక్, యూనిస్ ఖాన్‌లను నియమించడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. పాకిస్తాన్ జట్టు వనే్డ ర్యాంకింగ్స్‌లో అట్టడుగు స్థానానికి పడిపోవడం హఠాత్తుగా ఒక్కరోజులో జరిగిన పరిణామం కాదని అంటున్నారు. గత ఐదారు సంవత్సరాలు కాలంలో పాక్ తరఫున ఆడిన లేదా ఆడుతున్న వారంతా ఇందుకు కారణమేనన్న వాదన బలంగా వినిపిస్తున్నది. ఈ జాబితాలో మిస్బా, యూనిస్ ఖాన్ కూడా ఉన్నారని, పాక్ క్రికెట్ పతనానికి కారణమైన వారు సలహాలు సూచనలు ఇవ్వడానికి అర్హులా? అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. అన్ని రకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్న పిసిబి తీసుకున్న నిర్ణయాల్లో ఇంజమాముల్ హక్‌ను చీఫ్ సెలక్టర్‌గా నియమించడం ఒక్కటే విమర్శల దాడి నుంచి తప్పించుకుంది.