ఆటాపోటీ

క్రీడలపై ట్రంప్ ఎఫెక్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మిగతా రంగాలతోపాటు క్రీడలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నది. కొంత మంది క్రీడాకారుల కెరీర్ ప్రమాదంలో పడితే, కొన్ని దేశాలు ఎదురుదాడికి దిగాయి. ట్రంప్ ఎఫెక్ట్ కేవలం క్రీడాకారులపైనేగాక, కోచ్‌లు, సపోర్టింగ్ స్ట్ఫా, అధికారులపైనా పడుతున్నది. శరణార్థులు దేశంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న ట్రంప్ నిర్ణయాలపై అక్కడి కోర్టులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇస్లామిక్ ఉగ్రవాదులను నిలువరించే పేరుతో ఏడు దేశాలకు చెందిన ఎవరూ అమెరికాలో అడుగుపెట్టడానికి వీల్లేదని అతను జారీ చేసిన ఉత్తర్వులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అమెరికాకు చెందిన రెజ్లర్లు తమ దేశంలోకి రావడానికి వీల్లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. కెర్మాన్‌షాలో ఈనెల 16, 17 తేదీల్లో ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ప్రపంచ కప్ జరగనుండగా, అమెరికా రెజ్లర్లపై సస్పెన్షన్ విధిస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడం వివిధ దేశాలు అనుసరించబోయే మార్గాన్ని స్పష్టం చేస్తున్నది. ఇరాన్‌లో రెజ్లింగ్‌కు ఎంతో ఆదరణ ఉంది. 1998లో తఖ్తీ కప్ చాంపియన్‌షిప్ తెహ్రాన్‌లో జరిగింది. అప్పటి నుంచి ఇరాన్‌లో ఏ పోటీలు జరిగినా అమెరికా రెజ్లర్లు పాల్గొనడం ఆనవాయితీగా మారింది. కానీ, ట్రంప్ నిర్వాకం కారణంగా అమెరికా రెజ్లర్లు ఇబ్బందుల్లో పడ్డారు.
క్రీడాభివృద్ధికి దెబ్బ!
ఏ దేశంలోనైనా క్రీడలు అభివృద్ధి చెందాలంటే, వివిధ దేశాలతో తరచు టోర్నీలు, సిరీస్‌లను నిర్వహించడం, విదేశీ కోచ్‌లతో శిక్షణ ఇప్పించడం అత్యవసరం. చాలా మంది కోచ్‌లు తమతమ దేశాలను విడిచి, విదేశాల్లో నివాసం ఉండడం కొత్తకాదు. అదే విధంగా ఫిజియోథెరపిస్టులు, మేనేజర్లు, ఇతర సపోర్టింగ్ స్ట్ఫాలోనూ విదేశీల పాత్ర కీలకంగానే ఉంది. సిరియా వంటి దేశాల నుంచి చాలా మంది శరణార్థులు ఇతర దేశాలకు వలసవెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. ఆయా దేశాల నుంచే పోటీపడుతున్నారు. ప్రపంచంలోనే బాస్కెట్‌బాల్ పోటీలంటే ముందుగా గుర్తుకొచ్చే ఎన్‌బిఎలో, అమెరికా జాతీయ ఐస్ హాకీ లీగ్ (ఎన్‌హెచ్‌ఎల్)లో ఎక్కువ మంది విదేశీ క్రీడాకారులే. అమెరికాలోనూ ఇది అనావాయితీనే. రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అమెరికా బృందంలో 47 మంది విదేశాల్లో జన్మించిన వారే. కైరీ ఇర్వింగ్ (బాస్కెట్‌బాల్), బాయిడ్ మార్టిన్ (ఈక్వెస్ట్రియన్), మాడిసన్ హ్యూజెస్ (రగ్బీ), టోనీ అజెవెడో (వాటర్ పోలో) తమతమ తల్లుల కారణంగా అమెరికాలో స్థిరపడి, అక్కడే అత్యున్నత ప్రమాణాలతో గొప్ప క్రీడాకారులుగా పేరుప్రఖ్యాతులు ఆర్జించారు. బెయిలర్ బొరా గులారీ, టెన్నిస్ క్రీడాకారిణి డెనిస్ కుడ్లా, ఫెన్సర్ డాగ్మరా వొజ్నియాక్ తమతమ తల్లిదండ్రులతో చిన్నతనంలోనే అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. హిల్లరీ బొర్, పాల్ చెలిమో, షాడ్రాక్ కిప్‌చిర్చిర్ కెన్యాలో జన్మించారు. ఇలా చెప్తూపోతే, శరణార్థులుగానో లేక ఉద్యోగాలు లేదా వ్యాపార పరంగానో అమెరికా వెళ్లి, అక్కడ స్థిరపడిన ఎంతో మంది ఆ దేశం నుంచే పోటీపడుతున్నారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్ వంటి మెగా ఈవెంట్స్‌లో అమెరికా అత్యధిక పతకాలను సాధించడానికి కారణం ఈ విధంగా స్థిరపడిన లేదా ఆ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకారులే. ట్రంప్ నిర్ణయం వల్ల క్రీడలకు భారీగా నష్టం తప్పదని
అమెరికా ఫుట్‌బాల్ జట్టు మేనేజర్ బ్రూస్ అరెనాచేసిన ప్రకటనను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. క్రీడలు విశ్వవ్యాపితం కావడమే క్రీడాస్ఫూర్తికి అసలైన అర్థమని, శరణార్థులు, విదేశాల నుంచి ఉద్యోగం కోసం వచ్చే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రయత్నించడం మంచిది కాదని ట్రంప్‌కు అరెనా సూచించాడు. ఎన్‌బిఎ కోచ్‌లు స్టీవ్ కెర్ (గోల్డెన్ స్టేట్ వారియర్స్), ఆగెగ్ పొపొవిచ్ (శాన్ ఆంటోనియా స్పర్స్) కూడా ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. ట్రంప్‌వి క్రీడలను దెబ్బతీసే అనాలోచిత చర్యలని విమర్శించారు. కాగా, వివిధ యూనివర్శిటీల్లోనూ ట్రంప్ జ్యాత్యాహంకార వైఖరిపై నిరసలు పెల్లుబుకుతున్నాయి. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయి. నిరసనలు, విమర్శలతో అమెరికా హోరెత్తిపోతున్నది. పరిస్థితులను గమనించి, ట్రంప్ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటాడా లేక తన ఒంటెద్దు పోకడనే కొనసాగిస్తాడా అన్నది చూడాలి. అతను తన వైఖరిని మార్చుకోకపోతే, క్రీడల్లో సూపర్ పవర్ స్థానాన్ని అమెరికా నిలబెట్టుకోవడం కష్టమే.