ఆటాపోటీ

రోహిత్ ‘డబుల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ వనే్డ క్రికెట్ చరిత్రలో ఆరు పర్యాయాలు మాత్రమే డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. భారత ఆటగాడు రోహిత్ శర్మ రెండు పర్యాయాలు డబుల్ సెంచరీ సాధించి, అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 2013 నవంబర్ 2న బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డలో అతను 209 పరుగులు చేశాడు. 2014 నవంబర్ 13న కోల్‌కతాలో శ్రీలంకతో జరిగిన వనే్డలో 264 పరుగులు చేశాడు. వనే్డల్లో ఇప్పటి వరకూ అదే అత్యధిక స్కోరు. కాగా, సచిన్ (గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాపై 200 నాటౌట్), వీరేందర్ సెవాగ్ (వెస్టిండీస్‌పై ఇండోర్‌లో 219), క్రిస్ గేల్ (జింబాబ్వేపై కాన్‌బెరాలో 215), మార్టిన్ గుప్టిల్ (వెస్టిండీస్‌పై వెల్లింగ్టన్‌లో 237 నాటౌట్) కూడా వనే్డల్లో డబుల్ సెంచరీలు చేశారు.