ఆటాపోటీ

క్రికెటర్లకు హెల్మెట్లు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెటర్లకు హెల్మెట్ల వాడకాన్ని తప్పనిసరి చేయాలని ప్రమాదాలకు కారణాలు, నివారణపై అధ్యయనం చేసిన డేవిడ్ కుయెర్టన్ క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులకు ప్రతిపాదించాడు. అధునాతన రక్షణ సామాగ్రిని క్రికెటర్లకు అందుబాటులో ఉంచాలని సూచించాడు. ఆస్ట్రేలియా దేశవాళీ పోటీల్లో భాగంగా 2014 నవంబర్ 25న జరిగిన షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో సౌత్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఫిల్ హ్యూస్ 63 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా, అతని ఏకాగ్రతను దెబ్బతీయడానికి న్యూసౌత్ వేల్స్ ఫాస్ట్ బౌలర్ సీన్ అబోట్ వేసిన బౌన్సర్ బలంగా మెడకు తగిలింది. హెల్మెట్ కింది భాగం నుంచి దూసుకెళ్లిన బంతి హ్యూస్ తల, మెడ మధ్య భాగంలో తగలడంతో అతను అక్కడే కూలిపోయాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ 27న మృతి చెందాడు. ఈ సంఘటనతో దిగ్బ్రాంతికి లోనైన క్రికెట్ ఆస్ట్రేలియా వెంటనే విచారణకు ఆదేశించింది. డేవిడ్ కుయెర్టన్‌కు బాధ్యతలు అప్పచెప్పింది. ఆటగాళ్ల భద్రతపై పలు కోణాల్లో అధ్యయనం చేసి, నివేదిక సమర్పించిన అతను బ్యాట్స్‌మెన్‌కు, క్లోజ్ ఫీల్డర్లకు హెల్మెట్లను ధరించడం అనివార్యమన్న నిబంధనను చేర్చాలని తన నివేదికలో తెలిపాడు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన హెల్మెట్ల వల్ల ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని అభిప్రాయ పడ్డాడు. అయతే, హ్యూస్ ఒకవేళ నేడు అందుబాటులో ఉన్న అత్యాధునిక హెల్మెట్‌ను వాడినా అతను మృత్యువును తప్పించుకో లేకపోయేవాడని స్పష్టం చేసింది. బంతి మెడకు తగిలి ఉంటే, అతను వాడిన హెల్మెట్‌ను తప్పుపట్టాలని, ఇప్పుడు అందుబాటులో ఉన్న హెల్మెట్ల వల్ల మెడకు దెబ్బ తగిలే అవకాశం లేదని పేర్కొన్నాడు. కానీ, బంతి హెల్మెట్ కింది భాగం నుంచి దూసుకెళ్లి, మెడ, తల మధ్య భాగంలో తగిలిన విషయాన్ని ప్రస్తావిం చాడు. కాబట్టి అతని మృతికి కారణమైన గాయం హెల్మెట్ నాణ్యతా ప్రమాణాల వల్ల తగిలింది కాదని తెలిపాడు.
ఎన్నో సంఘటనలు..
క్రికెట్ బంతులు బౌండరీలకు తరలినప్పుడు ప్రేక్షకులను కేరింతలు కొట్టించడమేకాదు.. బలంగా తగిలినప్పుడు ఆటగాళ్ల ప్రాణాలు కూడా తీస్తున్నాయి. ఇందుకు ఎన్నో సంఘటనలను ఉదాహరణగా పేర్కో వచ్చు. 1959లో ఖయిద్ ఎ అజామ్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నప్పడు వేగంగా వచ్చిన బంతి వికెట్‌కీపర్ అబ్దుల్ అజీజ్ ఛాతీకి తగిలింది. 17 ఏళ్ల అజీజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. 1998లో బంగ్లాదేశ్‌లో ఒక దేశవాళీ మ్యాచ్ ఆడుతూ మెహ్రాబ్ హొస్సేన్ కొట్టిన బంతి ఫార్వర్డ్ షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రమణ్ లాంబ తలకు తగలింది. లాంబ తలను కొట్టుకున్న తర్వాత బంతి వికెట్‌కీపర్‌కు క్యాచ్‌గా వెళ్లిందంటే గాయం తీవ్రతను ఊహించుకోవచ్చు. డ్రెస్సింగ్ రూమ్ వరకూ తనంతట తానే వెళ్లిన లాంబ అక్కడ కుప్పకూలిపోయాడు. ఆరు రోజులు కోమాలో ఉండి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2013 డిసెంబర్‌లో 22 ఏళ్ల పాకిస్తాన్ క్రికెటర్ జుల్ఫీకర్ భట్టీ సూపర్ స్టార్ క్లబ్ తరఫున మ్యాచ్ ఆడుతూ బంతి ఛాతీకి తగలడంతో పిచ్‌పైనే కుప్పకూలి మృతి చెందాడు. దక్షిణాఫ్రికాకుచెందిన 32 ఏళ్ల డారెన్ రాండల్ ఒక దేశవాళీ మ్యాచ్ ఆడుతూ బంతి తలకు తగిలి అక్కడికక్కడే మరణించాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు జార్జి స్మెర్జ్, ఇయాన్ ఫోలే, అదే దేశానికి చెందిన అంపైర్ అక్లన్ జెన్కిన్స్ బంతి తగిలిన సంఘటనల్లోనే మరణించారు. క్రికెట్ బంతులు ప్రాణాలు తీస్తున్నాయని చెప్పడానికి హ్యూస్ మృతి తాజా ఉదాహరణ.
వెస్టిండీస్ పర్యటనకు 1961-62లో వెళ్లినప్పుడు, అప్పటి భారత కెప్టెన్ నారీ కాంట్రాక్టర్ తలకు గాయమైంది. చార్లెస్ గ్రిఫిత్ వేసిన బంతి కాంట్రాక్టర్ తలకు తగిలింది. కోమాలోకి వెళ్లిన అతను ఆతర్వాత కోలుకున్నా మళ్లీ క్రికెట్ ఆడలేకపోయాడు. దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్ మార్క్ బౌచర్ 2012లో అర్ధాంతరంగా కెరీర్‌కు దూరమయ్యాడు. బంతి వికెట్లకు తగిలినప్పుడు గాల్లోకి ఎగిరిన బేల్స్ అతని కంటికి తగిలాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను తిరిగి కెరీర్‌ను కొనసాగించలేకపోయాడు. ఇక కాళ్లూ, చేతులు, ఎముకలు విరగ్గొట్టుకున్న ఆటగాళ్లకు కొదువ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఎదో ఒక సమయంలో చిన్నగాయమైనా కాకుండా క్రికెట్ ఆడిన ఆటగాళ్లు లేరనే చెప్పాలి.

chitram సీన్ అబోట్ వేసిన బంతి తల, మెడ మధ్య భాగంలో బలంగా తగలడంతో మైదానంలోనే కుప్పకూలిన ఫిల్ హ్యూస్‌కు సపర్యలు చేస్తున్న ఫీల్డర్లు. కోమాలోకి వెళ్లిన హ్యూస్ రెండు రోజుల తర్వాత ఆసుపత్రిలో మృతి చెందాడు.