ఆటాపోటీ

తల్లులతోనూ విభేదాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెటర్లపై తల్లులే ఆరోపణలు చేసిన సంఘటనలు లేకపోలేదు. పంజాబ్ ఆల్‌రౌండర్ మన్‌ప్రీత్ గోనీ, మాజీ వికెట్‌కీపర్ నయన్ మోంగియా ఇలాంటి వివాదాల్లోనే చిక్కుకున్నారు. జాతీయ జట్టుకు వనే్డ ఇంటర్నేషనల్స్‌లో ప్రాతినిథ్యం వహించిన గోనీ తనను చంపుతానని బెదిరించినట్టు ఆతని తల్లి మొహీందర్ కౌర్ ఆరోపించింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. 2008లో ఈ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత గోనీ కెరీర్ ప్రమాదంలో పడింది. ఆ తర్వాత అతనికి మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కలేదు. మాజీ వికెట్‌కీపర్ నయన్ మోంగియాపై అతని తల్లి జ్ఞానదేవి కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. తనను బెదిరిస్తున్నాడనీ, తరచు వేధిస్తూ నరకం చూపిస్తున్నాడని ఆమె కోర్టును ఆశ్రయించింది. తనకు భర్తద్వారా దక్కిన భవనంలోని ఒక వాటాను అతను బలవంతంగా ఆక్రమించుకున్నాడని ఆమె లోక్ అదాలత్‌లోనూ ఫిర్యాదు చేసింది. నయన్ మోంగియాపై తల్లి మాత్రమే కాదు.. అతని భార్య కూడా కోర్టుకెక్కింది. సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగిన అతను చివరికి తల్లి, భార్యతో రాజీ కుదుర్చుకున్నాడు. కేసుల నుంచి బయటపడినా, తల్లిని, భార్యను వేధించిన క్రికెటర్‌గా అతను కావాల్సినంత చెడ్డపేరును సంపాదించాడు.

చిత్రాలు.. నయన్ మోంగియా, మన్‌ప్రీత్ గోనీ