ఆటాపోటీ

సచిన్‌కూ తప్పని వివాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెట్ రారాజుగా వెలిగిపోయిన సచిన్ తెండూల్కర్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటాడు. లెక్కకు మించి రికార్డులను తన ఖాతాలో చేర్చుకున్న అతనికి అజాత శత్రువన్న పేరుంది. ఎప్పుడూ ఆచితూచి మాట్లాడే అతనికి కూడా వివాదాల తాకిడి తప్పలేదు. టెస్టు క్రికెట్‌లో అత్యధికంగా 23 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ రికార్డును 2003లో సచిన్ సమం చేశాడు. ఆ మైలురాయిని చేరినుందుకు గుర్తింపుగా ఫియట్ సంస్థ అతనికి ఫెరారీ కారును బహూకరించింది. 2013లో దానిని భారత్ తీసుకొచ్చినప్పుడు, తనకు కస్టమ్ సుంకం నుంచి మినహాయింపునివ్వాలని ప్రభుత్వాన్ని సచిన్ కోరడం వివాదానికి కారణమైంది. కోట్లకు పడగలెత్తిన సచిన్ పన్ను మినహాయంపును కోరడం, ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందిస్తూ, దిగుమతి సుంకంగా చెల్లించాల్సిన 120 శాతం మొత్తాన్ని రద్దు చేయడం విమర్శలకు దారి తీసింది.