ఆటాపోటీ

సగటుల్లో సంగక్కర టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యుత్తమ సగటును నమోదు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర టాపర్‌గా నిలుస్తాడు. 2007లో అతను తొమ్మిది ఇన్నింగ్స్ ఆడి 138.29 సగటుతో 968 పరుగులు సాధించాడు. రెండు పర్యాయాలు నాటౌట్‌గా నిలిచాడు. అతని స్కోరులో నాలుగు శతకాలున్నాయి. రెండో స్థానం కూడా శ్రీలంక బ్యాట్స్‌మన్‌కే దక్కడం విశేషం. హసన్ తిలకరత్నే 2001లో పది ఇన్నింగ్స్ ఆడి, సగటున 136.40 పరుగులు చేశాడు. ఐదుసార్లు అవుట్ కాలేదు. వెస్టిండీస్ లెజెండరీ ఆల్‌రౌండర్ గారీ సోబర్స్ 1958లో 13 టెస్టు ఇన్నింగ్స్ ఆడి 132.56 సగటుతో 1,193 పరుగులు చేశాడు. నాలుగుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన క్రికెటర్ల జా బితాలో సోబర్స్‌ను ప్రముఖంగా పేర్కొంటారు. అప్పట్లో ఉన్న పరిమిత సౌకర్యాలను ఉపయోగించుకొని అతను తిరుగులేని ఆల్ రౌండర్‌గా ఎదిగాడు. సగటులో సంగక్కర అగ్రస్థానాన్ని ఆక్రమించినప్పటికీ, సోబర్స్ ఆల్‌రౌండ్ ప్రతిభ ముందుగానీ, సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ కెరీర్ సగటు ముందుగానీ అతని రికార్డు వెలవెలపోతుంది. కానీ, క్రికెట్‌లో ఏ రికార్డు గొప్పదనం దానికి ఉంటుంది.

- సత్య