ఆటాపోటీ

ఐపిఎల్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఐపిఎల్‌లో ఇప్పటి వరకూ 14 పర్యాయాలు హ్యాట్రిక్స్ నమోదయ్యాయి. 2008లో లక్ష్మీపతి బాలాజీ (చెన్నై సూపర్ కింగ్స్/ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై), అమిత్ మిశ్రా (్ఢల్లీ డేర్‌డెవిల్స్/ డక్కన్ చార్జర్స్‌పై), మఖయా ఎన్తినీ (చెన్నై సూపర్ కింగ్స్/ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై), 2009లో యువరాజ్ సింగ్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై), రోహిత్ శర్మ (డక్కన్ చార్జర్స్/ ముంబయి ఇండియన్స్‌పై), యువరాజ్ సింగ్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ డక్కన్ చార్జర్స్‌పై), 2010లో ప్రవీణ్ కుమార్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు/ రాజస్థాన్ రాయల్స్‌పై), 2011లో అమిత్ మిశ్రా (డక్కన్ చార్జర్స్/ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై), 2012లో అజిత్ చండీలా (రాజస్థాన్ రాయల్స్/ పుణే వారియర్స్‌పై), 2013లో సునీల్ నారైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్/ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై), అమిత్ మిశ్రా (సన్‌రైజర్స్ హైదరాబాద్/ పుణే వారియర్స్‌పై), 2014లో ప్రవీణ్ తంబే (రాజస్థాన్ రాయల్స్/ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై), షేన్ వాట్సన్ (రాజస్థాన్ రాయల్స్/ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై), 2016లో అక్షర్ పటేల్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ గుజరాత్ లయన్స్‌పై) హ్యాట్రిక్స్ చేశారు.
* లలిత్ మోదీ కమిషనర్‌గా వ్యవహరించగా, మొదటి ఐపిఎల్ 2008లో మొదలైంది. ఏప్రిల్ 18 నుంచి జూన్ ఒకటి వరకూ జరిగిన ఈ టోర్నీ క్రికెట్‌లో ఒక సంచలనం సృష్టించింది. ఎవరూ ఊహించని తుపానుకు కారణమైంది. అప్పటి వరకూ చీర్ లీడర్ల చిందులనుగానీ, సినీ స్టార్ల సందడినిగానీ చూసే అవకాశం లభించని క్రికెట్ అభిమానులకు ఐపిఎల్ ఆశాకిరణమైంది. సరికొత్త దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించింది. కాగా, రెండో ఐపిఎల్ 2009 ఏప్రిల్ 18 నుంచి జూన్ ఒకటి వరకు జరిగింది. ఆతర్వాత వరుసగా 2010 (మార్చి 12 నంచి ఏప్రిల్ 25 వరకు), 2011 (ఏప్రిల్ 8 నుంచి మే 28 వరకు), 2012 (ఏప్రిల్ 4 నుంచి 27 మే వరకు), 2013 (ఏప్రిల్ 3 నుంచి 26 మే వరకు), 2014 (ఏప్రిల్ 16 నుంచి జూన్ 1 వరకు), 2015 (ఏప్రిల్ 8 నుంచి మే 24 వరకు), 2016 (ఏప్రిల్ 9 నుంచి మే 29 వరకు) ఐపిఎల్ టోర్నీలు జరిగాయి. మొత్తం మీద ఇప్పటి వరకూ 9 పర్యాయాలు ఐపిఎల్ జరగ్గా, పదో విడత పోటీలు ఏప్రిల్ 5 నుంచి మే 21వ తేదీ వరకు జరగనున్నాయి.