ఆటాపోటీ

సిఒఎ ముందున్న సవాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీం కోర్టు నియమించిన సిఒఎ ముందు పలు సవాళ్లు ఉన్నాయన్నది వాస్తవం. లోధా కమిటీ ప్రతిపాదనలను సంపూర్ణంగా అమలు చేయడం అసాధ్యమని కోర్టుకు బిసిసిఐ వివిధ సందర్భాల్లో స్పష్టం చేసింది. అంతేగాక, ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిబంధనావళిని మార్చే అధికారం సర్వసభ్య సమావేశానికే ఉంటుంది కాబట్టి, లోధా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా తీర్మానాలను ఏ విధంగా ఆమోదింప చేసుకోవాలన్నది సిఒఎ ముందున్న ప్రధాన సమస్య. కేవలం క్రికెట్‌లోనేగాక, మిగతా అన్ని క్రీడల్లోనూ లోధా సిఫార్సులను అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. క్రికెట్‌ను పారదర్శకంగా ఉంచేందుకు చేసిన ప్రతిపాదనలు మిగతా క్రీడా సమాఖ్యల పాలనా వ్యవహారాలకు కూడా వర్తింప చేస్తేగానీ భారత క్రీడారంగం మెరుగుపడదని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో, బిసిసిఐలో రాబోయే మార్పుల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ మార్పులను తెచ్చే బాధ్యత సిఒఎపైనే ఉంది. ఆటగాళ్ల వల్లే క్రీడలకు ప్రాచుర్యం లభిస్తుందిగానీ పాలకుల వల్ల కాదన్న విషయాన్ని సిఒఎ నిరూపించాలి. క్రీడా సంఘాలు, సమాఖ్యలపై క్రీడలతో సంబంధం లేని వ్యక్తులు అధికారం చెలాయించే ఆనవాయితీకి సిఒఎ తెరదించాలి. లోధా కమిటీ సిఫార్సులను తు.చ తప్పకుండా అమలు చేస్తే, దేశంలో క్రికెట్ పాలనా వ్యవహారాలు మెరుగుపడతాయ. దేశ క్రీడా రంగాన్ని శాసించే క్రికెట్ పనితీరు బాగుపడితే, మిగతా క్రీడలన్నీ అభివృద్ధి బాటలో పయనిస్తాయి. అందుకే ఇప్పుడు అందరి దృష్టీ సిఒఎ తీసుకోబోయే నిర్ణయాలు, వాటిని అమలు చేసే విధానాలపై కేంద్రీకృతమైంది.

ఐపిఎల్‌పై దృష్టి
ఐపిఎల్‌పై సిఒఎ దృష్టి సారించింది. బిసిసిఐ ప్రధాన బలం ఐపిఎల్ టోర్నీనే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. మ్యాచ్‌ల ప్రసార హక్కుల నుంచి అండార్స్‌మెంట్ల వరకూ ఐపిఎల్ ద్వారా కోట్లాది రూపాయలు సమకూరుతున్నాయి. ప్రస్తుతం ఐపిఎల్ మ్యాచ్ ప్రసారాల హక్కులు సోనీ నెట్‌వర్క్ సంస్థ వద్ద ఉన్నాయి. ఈ ఏడాదితో కాంట్రాక్టు పూర్తవుతుంది. 2018 నుంచి పదేళ్ల కాలానికి టీవీ, ఇంటర్నెట్, మొబైల్‌లో ఐపిఎల్ మ్యాచ్‌ల ప్రసార, సమాచార హక్కులను కేటాయించే విధానాన్ని సిఒఎ పర్యవేక్షిస్తున్నది. వివిధ లావాదేవీలను ఆడిట్ చేయించడం, ప్రసార హక్కులను పర్యవేక్షించడం వంటి కీలక అంశాలు సిఒఎ పర్యవేక్షణలో జరిగితే, బోర్డు అధికారాలు కుదించుకుపోవడం ఖాయం. ఇది భారత క్రికెట్‌కు సరైన దిశా నిర్దేశనం చేసే పరిణామమే అవుతుంది.