ఆటాపోటీ

కోచ్ క్రీడాస్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడా స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు నార్వేకు చెందిన కోచ్ జొర్నర్ హాకెన్స్‌మన్. 2006 వింటర్ ఒలింపిక్స్‌లో నార్వే క్రాస్ కంట్రీ స్కీయింగ్ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించాడు. ఆసమయంలో కెనడాకు చెందిన ఒక స్కీయర్ అవసరాన్ని గుర్తించి, ఆమెకు స్కీ పోల్‌ను ఇచ్చాడు. దానిని తీసుకొని రేస్‌లో పాల్గొన్న ఆ స్కీయర్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కెనడా అభిమానులంతా జొర్నర్ క్రీడాస్ఫూర్తిని కొనియాడారారు. అతనికి 7,400 ‘మేపుల్ సిరప్’ క్యాన్లను బహూకరించారు. గతంలో ఎన్నడూ ఈ పండ్ల రసాన్ని రుచిచూడని జొర్నర్ లొట్టలు వేసుకుంటూ కొన్ని క్యాన్లను తాగేశాడు. కానీ, వేల సంఖ్యలో క్యాన్లను ఏం చేసుకోవాలో తెలియక కనిపించిన వారందరినీ పిలిచి మరీ వాటిని ఇచ్చాడట.

- సత్య