ఆటాపోటీ

ఇదేం పని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక క్లబ్ స్థాయి మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ జెర్సీలను ధరించి వచ్చిన కాశ్మీరీ క్రికెటర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడడం దురదృష్టకరమని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. కాగా, పాక్ జెర్సీలు ధరించిన క్రికెటర్లను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే, సెంట్రల్ కాశ్మీర్‌లోని గండేర్‌బల్ క్రీడా మైదానంలో కల్ముల్ ప్రాంతానికి చెందిన బాబా దర్యా ఉద్దీన్ క్రికెట్ క్లబ్ సభ్యులు ఒక మ్యాచ్‌ని ఆడేందుకు వచ్చారు. వారంతా పాక్ జాతీయ క్రికెట్ జట్టు జెర్సీలను ధరించడం సంచలనం సృష్టించింది. కాశ్మీర్ మీడియాలో ఈ ఫొటోలు దర్శనం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే తీరులో వ్యవహరించిన 11 మంది క్రికెటర్లను అదుపులోకి తీసుకొని, వారిపై కేసులు నమోదు చేశారు.