ఆటాపోటీ

పాతాళంలో చేపల వేట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అత్యధిక శాతం మందికి ఫిషింగ్ ఓ ఆట. మత్స్యకారులను మినహాయిస్తే, చాలా మంది ఔత్సాహికులు గాలాలు పట్టుకొని చెరువులు, కుంటలు, వాగులు, నదుల్లో చేపలు పట్టి ఆనందిస్తుంటారు. ఈ విధంగా సంప్రదాయ పద్ధతుల్లో చేపల వేటకు ససేమిరా అంటున్న కొంతమంది కొండ చెరియల నుంచి సుమారు 400 అడుగుల కిందకు దిగి చేపలు పడుతున్నారు. తూర్పు యార్క్‌షైర్ (బ్రిటన్)లోని బ్రిడ్లిటన్‌లో ఈ తంతు కొనసాగుతున్నది. గాలాలతోపాటు తాళ్లు, ఇతర సరంజామాను కూడా మోసుకొని వాటి సాయంతో కొండ శిఖరాల పైనుంచి కిందకు దిగి మరీ చేపలు పట్టి సంతోషిస్తున్నారు. ఈ ప్రయత్నంలో ప్రమాదాలు జరుగుతాయని తెలిసినప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఇదేమిటని అడిగితే, ‘మీరూ రండి అద్భుతంగా ఉంటుంది’ అంటూ ఉచిత సలహాలిస్తున్నారు. ప్రమాదాలతో ఆడుకోవడం వారికి ఇష్టమేమో!