ఆటాపోటీ

డోప్ పరీక్షలో జెమీమా ఫెయిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒలింపిక్స్ మారథాన్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి కెన్యా మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన జెమీమా సంగాంగ్ డోప్ పరీక్షలో విఫలమైంది. దీనితో, 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె సాధించిన స్వర్ణ పతకాన్ని రద్దు చేయాలని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) తీర్మానించినట్టు బ్రిటిష్ మీడియా ప్రకటించింది. అయితే, ఈ విషయాన్ని సమాఖ్య ఇంకా ధ్రువీకరించలేదు. 2012 బోస్టర్ మారథాన్‌లో షరోన్ చెరోప్‌తో చివరి క్షణం వరకూ తీవ్రంగా పోటీపడిన జెమీమా కేవలం సెకను తేడాతో టైటిల్‌ను కోల్పోయి, రజత పతకంతో సంతృప్తి చెందింది. ఆ వెంటనే ఆమె డోప్ పరీక్షలో విఫలమైనట్టు కెన్యా అథ్లెటిక్స్ సమాఖ్య (కెఎఎఫ్) నిర్ధారించింది. నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడినందుకు ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, తాను సాధారణ రుగ్మతలకు మందులు వాడానని, ఒకానొక సందర్భంలో తీసుకున్న ఇంజక్షన్‌లో నిషిద్ధ మాదక ద్రవ్యాలు ఉన్నట్టు తనకు తెలియదని ఆమె ఐఎఎఎఫ్‌కి దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. తాను ఉద్దేశపూర్వకంగా డోపింగ్‌కు పాల్పడలేదని, కాబట్టి నిషేధాన్ని ఎత్తివేయాలని కోరింది. కేసును పరిశీలించిన ఐఎఎఎఫ్ మొదటి తప్పుగా పరిగణించి, జెమీమాకు క్లీన్‌చిట్ ఇచ్చింది. నిషేధం నుంచి బయటపడిన ఆమె నిరుడు ఫిలడేల్ఫియా హాఫ్ మారథాన్‌ను గెల్చుకుంది. రియో ఒలింపిక్స్‌లో ఏకంగా స్వర్ణాన్ని సాధించింది. అయితే, ఒలింపిక్స్ సమయంలో ఆమె నిషిద్ధ మాదక ద్రవ్యాన్ని వాడినట్టు కెఎఎఫ్ నిర్ధారించింది. ఆమెను ఐఎఎఎఫ్ సస్పెండ్ చేసినట్టు సమాచారం. రెండోసారి డోపింగ్ పరీక్షలో పట్టుబడిన జమీమా ఇప్పుడు తనను తాను ఏ విధంగా సమర్థించుకుంటుందో చూడాలి.