ఆటాపోటీ

క్రమశిక్షణకు ఆమడ దూరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లకూ, క్రమశిక్షణకూ ఆమడ దూరమన్న విమర్శలకు సొహైల్ ఖాన్ ఉదంతం బలాన్నిస్తున్నది. మాజీ పేసర్లు షోయబ్ అక్తర్, వసీం అక్రం, వకార్ యూనిస్ తదితరులు క్రికెట్ మైదానంలోగాక, ఆతర్వాత ఇప్పటికీ వివాదాస్పద వైఖరితో పాక్ క్రికెట్ ప్రతిష్ఠను బజారుకీడుస్తునే ఉన్నారు. మహమ్మద్ అమీర్, మహమ్మద్ ఆసిఫ్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి జైలు శిక్షను కూడా ఎదుర్కొన్నారు. అమీర్ సస్పెన్షన్ కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ జట్టులోకి వస్తే, ఆసిఫ్‌ను సెలక్టర్లు దూరంగానే ఉంచుతున్నారు. పాక్ ఫాస్ట్ బౌలర్ల వివాదాస్పద వైఖరికి తాజా ఉదాహరణగా సొహైల్ ప్రవర్తనను పేర్కోవచ్చు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)లో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న కరాచీ కింగ్స్‌కు మాజీ ఆల్‌రౌండర్ అజర్ మహమూద్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. జాతీయ జట్టు కోచ్ మికీ ఆర్థర్ కరాచీ జట్టుకు కూడా కోచ్‌గా ఉన్నాడు. దుబాయ్‌లో పిఎస్‌ఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో అజర్ మహమూద్‌పై సొహైల్ తిట్ల వర్షం గురిపించాడని సమాచారం. ‘జంగ్’ పత్రిక తన వార్తాకథనం ప్రకారం, వాహబ్ రియాజ్, మహమ్మద్ అమీర్‌ను ప్రోత్సహిస్తూ, తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని అజర్ మహమూద్‌పై సొహైల్ విరుచుకుపడ్డాడు. తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడని, తనను లక్ష్యంగా చేసుకొని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆరోపించాడు. ఈ ఉదంతాన్ని అజర్ మహమూద్ పాక్ జాతీయ సెలక్షన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాడని, అందుకే, వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే జట్టులో సొహైల్‌కు చోటు దక్కలేదని సమాచారం.