ఆటాపోటీ

భారత్‌దే పైచేయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో విజయాల విషయానికి వస్తే, పాక్‌పై భారత్ పైచేయి సాధించింది. రావల్పిండిలో జరిగిన టెస్టును ఇన్నింగ్స్ 131 పరుగుల తేడాతో గెల్చుకుంది. ఫిరోజ్ షా కోట్లాలో ఇన్నింగ్స్ 70, ముల్తాన్ క్రికెట్ మైదానంలో ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో విజయాలను నమోదు చేసింది. మొత్తం మీద టీమిండియా మూడు సార్లు పాక్‌పై ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది. కాగా, భారత్‌పై పాక్ రెండు పర్యాయాలు ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజయాలను నమోదు చేసింది. ఒకసారి ఇన్నింగ్స్ 119, మరోసారి ఇన్నింగ్స్ 86 పరుగుల తేడాతో గెలిచింది.
* ఆసియా కప్ వనే్డ ఇంటర్నేషనల్ టోర్నీలో భారత్, పాక్ సమవుజ్జీలుగా ఉన్నాయి. ఈ టోర్నీలో పది మ్యాచ్‌లకుగాను ఇరు జట్లు చెరి ఐదు విజయాలు సాధించాయి. ఆసియా టి-20 టోర్నీలో ఈ జట్ల మధ్య ఒక మ్యాచ్ మాత్రమే జరిగింది. దానిని భారత్ గెల్చుకుంది. మొత్తం మీద వనే్డ ఇంటర్నేషనల్స్‌లో రెండు జట్లు 127 మ్యాచ్‌లు ఆడాయి. భారత్ 51 విజయాలు సాధిస్తే, పాకిస్తాన్ 72 మ్యాచ్‌లను గెల్చుకుంది. నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
* రెండు దేశాల మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక స్కోర్ల జాబితాలో మొదటి రెండు స్థానాలను పాకిస్తాన్ ఆక్రమించింది. ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 699, మరోసారి 7 వికెట్లకు 679 (డిక్లేర్డ్) పరుగులు సాధించింది. పాక్‌పై భారత్‌కు అత్యధిక స్కోరు 5 వికెట్లకు 675 (డిక్లేర్డ్) పాక్‌లోని ముల్తాన్ స్టేడియంలో భారత్ ఈ స్కోరు సాధించింది. అత్యల్ప స్కోర్ల విషయానికి వస్తే భారత్ అగ్రస్థానంలో ఉంది. ఈ జట్టు ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే అవుట్‌కాగా, భారత్‌పై పాక్ అత్యల్ప స్కోరు 116 పరుగులు.
* వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక స్కోర్ల జాబితాలో మొదటి రెండు స్థానాలు భారత్‌వే కావడం గమనార్హం. విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ తొమ్మిది వికెట్లకు 356, కరాచీలో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లకు 349 చొప్పున పరుగులు సాధించింది. వనే్డల్లో భారత్‌పై పాక్ అత్యధిక స్కోరు 8 వికెట్లకు 344 పరుగులు.
* వనే్డల్లో అత్యల్ప స్కోరు కూడా భారత్‌దే. సియాల్ కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 34.2 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్ అత్యల్ప స్కోరు 87 పరుగులు.
* పాకిస్తాన్‌తో టీమిండియా చివరిగా 2015 ఫిబ్రవరిలో వరల్డ్ కప్ మ్యాచ్‌లో తలపడింది. విరాట్ కోహ్లీ సెంచరీతో రాణించగా, ఆ మ్యాచ్‌ని భారత్ 76 పరుగుల తేడాతో గెల్చుకుంది. ప్రపంచ కప్‌లో పాక్‌ను అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడిస్తూ వచ్చిన భారత్ ఆ ఒరవడిని కొనసాగించింది.