ఆటాపోటీ

చిరకాల శత్రుత్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లను క్రికెట్‌లో చిరకాల శత్రువులుగా పేర్కొంటారు. అయితే, ఈ రెండు దేశాల జాతీయ గీతం ఒకటేనన్నది చాలా తక్కువ మందికి తెలిసిన నిజం. అంతేగాక, రెండు దేశాల జాతీయ జెండాల్లో చాలా సారూప్యం ఉంటుంది. చివరికి అభిమానులు తమతమ ఆటగాళ్లకు మద్దతునిచ్చే తీరు కూడా ఒకే రకం. ఆస్ట్రేలియా మద్దతుదారులు ‘ఆసీ ఆసీ ఆసీ ఒయ్ ఒయ్ ఒయ్’ అని అరిస్తే, న్యూజిలాండ్ అభిమానులు ‘కివీ కివీ కివీ ఒయ్ ఒయ్ ఒయ్’ అంటారు.
అరంగేట్రం
చాంపియన్స్ ట్రోఫీ 1998లో మొదటిసారి జరిగినప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు బరిలోకి దిగాయి. 2000లో బంగ్లాదేశ్, కెన్యా జట్లు ఈ టోర్నమెంట్‌లో అడుగుపెట్టగా, 2002లో నెదర్లాండ్స్, 2004లో అమెరికా ఈ టోర్నీలో అరంగేట్రం చేశాయి.