ఆటాపోటీ

టాప్ బ్యాట్స్‌మన్ హక్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగుల రికార్డు డెబిల్ హక్లే ఖాతాలో ఉంది. న్యూజిలాండ్‌కు చెందిన ఆమె 1982-2000 మధ్యకాలంలో జరిగిన వరల్డ్ కప్ టోర్నీల్లో మొత్తం 1,501 పరుగులు సాధించింది. ఒక టోర్నీలో ఎక్కువ పరుగుల రికార్డు కూడా ఆమె పేరిటే ఉంది. 1997లో ఆమె మొత్తం 456 పరుగులు సాధించింది. పది ఇన్నింగ్స్‌ను కనీస అర్హతగా తీసుకుంటే, అత్యధిక సగటు రికార్డును ఆస్ట్రేలియాకు చెందిన కరెన్ రాల్టన్ సొంతం చేసుకుంది. 1997-2009 మధ్యకాలంలో ఆడిన ఆమె సగటు 74.92 పరుగులు. కాగా, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు బెలిండా క్లార్క్‌ది. ఆస్ట్రేలియాకు చెందిన ఆమె 1997 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్‌పై 229 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచింది. అత్యధిక భాగస్వామ్యాన్ని న్యూజిలాండ్ జోడీ హైదీ టిఫెన్, సూజీ బేట్స్ సాధించారు. 2009లో వీరు 262 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశారు.
గ్రేట్ బౌలర్ ఫుల్‌స్టన్
మహిళల ప్రపంచ కప్‌లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ లిన్ ఫుల్‌స్టన్. ఆస్ట్రేలియాకు చెందిన ఈమె 1982-1988 మధ్యకాలంలో జరిగిన వరల్డ్ కప్స్‌లో పాల్గొని, 39 వికెట్లు కూల్చింది. ఒక టోర్నీలో ఎక్కువ వికెట్లు కూడా ఆమెవే కావడం విశేషం. 1982లో 23 వికెట్లు సాధించి ఈ రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. కాగా, ఒక ఇన్నింగ్స్‌లో ఉత్తమ బౌలింగ్ విశే్లషణను జాకీ లార్డ్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌కు చెందిన ఆమె 1982లో 10 పరుగులిచ్చి ఆరు వికెట్లు కూల్చింది.
ఎక్కువ మందిని అవుట్ చేసిన వికెట్‌కీపర్ జేన్ స్మిత్. ఎక్కువ క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్ జెనెటే బ్రిటిన్. ఇద్దరూ ఇంగ్లాండ్ క్రీడాకారిణులే.