ఆటాపోటీ

ఆస్ట్రేలియా టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల వరల్డ్ కప్ 1973లో మొదలైంది. ఇప్పటి వరకూ పదిసార్లు ఈ టోర్నీని నిర్వహించగా ఆరు పర్యాయాలు టైటిళ్లను కైవసం చేసుకొని ఆస్ట్రేలియా తన ఆధిక్యాన్ని నిరూపించుకుంది. 1978, 1982, 1988, 1997, 2005 తిరిగి 2013లో ఆసీస్ టైటిళ్లను అందుకుంది. రెండు సార్లు (1973, 2000) రన్నరప్ ట్రోఫీని అందుకుంది. ఒకసారి (1993) మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఒకే ఒకసారి (2009) దారుణంగా విఫలమై నాలుగో స్థానానికి పడిపోయింది. అయితే ఆ వెంటనే పట్టుదలతో కృషి చేసి, 2013లో చాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లాండ్ మూడు పర్యాయాలు (1973, 1993, 2009) టైటిల్ సాధించింది. న్యూజిలాండ్ ఒకసారి టైటిల్ అందుకుంది.
డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ఈసారి కూడా ఫేవరిట్‌గా పోటీలో ఉంది. ముంబయిలో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఏకంగా 114 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌ను చిత్తుచేసింది. ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 259 పరుగులు సాధించగా, వెస్టిండీస్ 43.1 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. మహిళల ప్రపంచ కప్‌లో అత్యధిక స్కోరు కూడా ఆస్ట్రేలియాదే. ఈ జట్టు 1997లో డెన్మార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లకు 412 పరుగుల భారీ స్కోరు సాధించింది. కాగా, అత్యల్ప స్కోరు పాకిస్తాన్‌ది. 1997లోనే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ 27 పరుగులకే ఆలౌటైంది.