ఆటాపోటీ

‘బిగ్ త్రీ’ ఆధిపత్యానికి చెల్లుచీటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)లో భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల హవాకు తెరపడనుందా? ఇన్నాళ్లు ‘మూడు’ముక్కలాట ఆడిన ఐసిసి ఇప్పుడు మార్పును కోరుకుంటున్నదా? భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ ఐసిసి స్వతంత్ర ప్రతిపత్తిగల చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో, అతను తీసుకోబోయే నిర్ణయాల వల్ల ఐసిసిలో మూడు దేశాల ఆధిపత్యానికి తెరపడి, మళ్లీ మునుపటి రోజులే వస్తాయా? క్రికెట్ అభిమానులను వేధిస్తున్న ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం వస్తుందో లేక ఏళ్లకు ఏళ్లు గడిచిపోతాయో చెప్పలేని పరిస్థితి. బిసిసిఐలో భారీ మార్పులు తీసుకొస్తానని హామీ గుప్పించి, బిసిసిఐ అధ్యక్షుడిగా రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన మనోహర్‌ను కోర్టు కేసులు వెంటాడాయ. లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేసి తీరాలని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో బిసిసిఐ దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నది. స్వదేశంలో సమస్యలు ఎదురైతే, వీటిని సాకుగా చూపి ఐసిసిపై భారత్‌కు ఉన్న ఆధిపత్యానికి గండికొట్టే ప్రయత్నం జరుగు తుందని మనోహర్ అనుమానిస్తున్నాడు. ఐసిసిని తమ చెప్పుచేతల్లో పెట్టుకొని ఆడిస్తున్నాయంటూ భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల కూటమిపై పాకిస్తాన్, వెస్టిండీస్ వంటి జట్లు ఆగ్రహంతో ఉన్నాయ. ఐసిసితో ఈ మూడు దేశాలు ఓ ఆటాడుకుంటున్నాయని విండీస్ తదితర దేశాల వాదన. ఐసిసికి క్రికెట్ అంటే పడిచచ్చే అభిమానులు కోట్లలో ఉన్న భారత్ నుంచే అత్యధిక ఆదాయం లభిస్తున్నది వాస్తవం. ఆ తర్వాతి స్థానాలు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆక్రమిస్తాయి. అత్యధిక ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నాయ కాబట్టే ఈ మూడు దేశాలు ఐసిసిని శాసిస్తున్నాయ. కాగా, ఆదాయంలో తమ వాటా ఎక్కువ కాబట్టి, లాభాల్లోనూ అదే దామాషాను అనుసరించాలని భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా బోర్డులు చాలా కాలంగా చేస్తున్న తమ డిమాండ్‌ను సాధించుకున్నాయ. ఐసిసి ఆధ్వర్యంలోని ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ సమర్పించిన 21 పేజీల నివేదిక ప్రకారం ఈ మూడు క్రికెట్ బోర్డులకు ప్రపంచ క్రికెట్‌పై పట్టు పెరిగింది. టెస్టు క్రికెట్‌కు తగ్గుతున్న ఆదరణ నుంచి, ఐసిసి కార్యకలాపాల పర్యవేక్షణ వరకూ అనేకానేక అంశాలను ఈ నివేదికలో ప్రస్తావించారు. ఐసిసి ఆదాయంలో సుమారుగా 75 శాతం భారత్ నుంచే లభిస్తోంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వాటాలు మెరుగ్గానే ఉన్నాయ. అయతే, శాశ్వత సభ్యత్వం ఉన్న మిగతా ఏడు దేశాల నుంచి లభించే ఆదాయం దాదాపుగా ఏమీ లేదు. అత్యధిక శాతం ఆదాయాన్ని సంపాదించి పెడుతున్న తమకు లాభాల్లోనూ అదే స్థాయలో వాటా లభించాలని బిసిసిఐ వాదించింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి), క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) సైతం ఆదాయంలో తమ వాటాకు తగ్గట్టుగానే పంపకాల్లోనూ తమకే ఎక్కువ మొత్తం దక్కాలని పట్టుబట్టాయ. ఈ వాదనలో బలం ఉన్న కారణంగా ఐసిసి నోరు మెదపలేక పోయంది.
భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాలను మినహాయిస్తే, మిగతా దేశాల్లో క్రికెట్ మ్యాచ్‌లను చూసేందుకు లక్షల మంది ఎగబడడం లేదు. క్రికెట్‌ను ఇంత పిచ్చిగా ఆభిమానించి, ఆరాధించడం లేదు. ఈ మూడు దేశాలను పోలిస్తే భారత్‌లోనే ఏ స్థాయ క్రికెట్ మ్యాచ్‌లకైనా ప్రేక్షకులతో స్టేడియాలు నిండిపోతాయ. అన్ని పనులు మానుకొని మ్యాచ్‌లను చూసేందుకు పరుగులు తీస్తారు. అప్రకటిత సెలవు దినంగా మారిపోతుంది. ఇక టీవీలో ప్రత్యక్ష ‚ప్రసారం చూసే వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. క్రికెట్‌ను ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తున్నారు కాబట్టే భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఆడే మ్యాచ్‌లకు స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం పెద్దపెద్ద కంపెనీలు క్యూ కడుతున్నాయ. కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నాయ. స్పాన్సర్ల కొరత లేదు. సహజంగా స్పాన్సర్‌షిప్ కోసం క్రీడా సంఘాలు, బోర్డులు నానా తంటాలు పడతాయ. ఎన్నో హామీలు గుప్పిస్తాయ. బతిమిలాడుకొని, బామాలుకొని, అతి కష్టం మీద స్పాన్సర్‌షిప్స్ సంపాదిస్తాయ. కానీ, భారత్ వంటి దేశాల్లో పరిస్థితి మరో విధంగా ఉంటుంది. స్పాన్సర్లే బిసిసిఐ ముందు సాగిలపడతాయ. అవకాశం తమకు ఇవ్వమంటే తమకు ఇవ్వమంటూ వేడుకుంటాయ. భారీ మొత్తాలతో బిడ్స్ వేస్తాయ. అటు ప్రేక్షకుల ఆదరణ, ఇటు స్పాన్సర్ల స్పందన అద్భుతంగా ఉండడంతో, భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాలు ఐసిసికి భారీగా ఆదాయాన్ని సంపాదించి పెడుతున్నాయి. అందుకే, ఈ మూడు దేశాలు ఒకానొక దశలో ప్రత్యక్ష యుద్ధానికి తలపడ్డాయ. నలుగురు సభ్యులతో కూడిన కమర్షియల్ రైట్స్ కమిటీలో బిసిసిఐ, ఇసిబి, సిఎ ప్రతినిధులు ఉండాలని ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ సిఫారసు చేసిందంటే, వీటి పట్టు ఏ స్థాయలో ఉందో ఊహించడం కష్టం కాదు. ఈ కమిటీలో నాలుగో సభ్యుడిని నియమించే అధికారాన్ని కూడా ఈ మూడు క్రికెట్ బోర్డులే దక్కించుకున్నాయ. మొత్తం మీద ఐసిసి ఆర్థిక వ్యవహారాలన్నీ ఈ మూడు దేశాల చేతుల్లోకి వెళ్లిపోయాయ. ఐసిసి కార్యవర్గం ఈ ప్రతిపాదనకు అంగీకరించక తప్పదలేదు. అర్థబలంతో బిసిసిఐ మిగతా క్రికెట్ బోర్డుల నోళ్లు నొక్కేస్తున్నదన్న ఆరోపణ నేటిది కాదు. ఐసిసిపై ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాల్లో ఇసిబి, సిఎ కూడా విజయం సాధించాయ.
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాలను ‘బిగ్ త్రీ’గా వ్యవహరిస్తారు. ఈ మూడు దేశాల్లో జరిగే మ్యాచ్‌లకు ఆదరణ ఎక్కువ. మిగతా దేశాల్లో క్రికెట్ మ్యాచ్‌లకు ప్రవేశం ఉచితమని ప్రకటించినా స్టాండ్స్ నిండవు. టెస్టు స్థాయని అందుకున్న దేశాల్లో చివరి రెండు దేశాలైన బంగ్లాదేశ్, జింబాబ్వేల్లో క్రికెట్‌ను అభిమానులు ఎవరూ పట్టించుకోవడం లేదు. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి పెద్ద దేశాలతో ఈ జట్లు తలపడినప్పుడు మాత్రమే కొంతలో కొంత స్పందన కనిపిస్తుంది. మిగతా దేశాలతో క్రికెట్ మ్యాచ్‌లు నష్టాలనే మిగిలిస్తున్నాయి. అందుకే, టెస్టు హోదాగల పది దేశాల్లో ‘బిగ్ త్రీ’ దేశాల హవా కొనసాగుతున్నది. ఐసిసిపై ‘బిగ్ త్రీ’ దేశాలు పెత్తనం సాగిస్తుంటే, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ తదితర దేశాలు ఈ పరిణామం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జెడ్‌సి) సైతం భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల ఆధిపత్యంపై గుర్రుగా ఉంది. 2009లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాద దాడి జగినప్పటి నుంచి పాకిస్తాన్‌లో పర్యటించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావడం లేదు. షార్జా, దుబాయ్ వంటి తటస్థ వేదికల్లో సిరీస్‌లు ఆడాల్సిన దుస్థితిలోవున్న పాకిస్తాన్‌కు ఐసిసి వ్యవహారాలపై స్పందించే సత్తాలేదు. ‘బిగ్ త్రీ’పై విమర్శలు గుప్పించినా, పాక్ అభిప్రాయాలను, ఆందోళనలను ఎవరూ పట్టించుకోలేదు. టెస్టు హోదా ఉంటుందా? లేదా? అని భయపడుతున్న జింబాబ్వే, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల పరిస్థితి మరీ అన్యాయం. ఐర్లాండ్, అఫ్గానిస్తాన్, కెనడా, కెన్యా, నెదర్లాండ్స్, స్కాట్‌లాండ్ వంటి దేశాలు టెస్టు హోదా కోసం తీవ్రంగా పోటీపడుతున్న తరుణంలో బంగ్లాదేశ్, జింబాబ్వే ఐసిసిలో చోటుచేసుకుంటున్న పరిణామాలను పట్టించుకోవడం లేదు. అందుకే ‘బిగ్ త్రీ’ ఆధిపత్యం కొనసాగింది. అయతే, ఇక పై గతంలో అనుసరించిన విధానాలకే కట్టుబడి ఉండాలని మనోహర్ ఇంతకు ముందే ప్రకటించగా, అతను ఇప్పుడు ఐసిసి చైర్మ న్‌గా ఎన్నిక కావడంతో ‘బిగ్ త్రీ’ ఆధిపత్యానికి చెల్లుచీటీ తప్పదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. దశాబ్దాల పోరాటం తర్వాత సంపాదించుకున్న హక్కును మనోహర్ తన స్వలాభం కోసం పణంగా పెట్టడం ఖాయంగా కనిపిస్తున్నది.

chitram స్వతంత్ర ప్రతిపత్తిగల ఐసిసి చైర్మన్‌గా
ఏకగ్రీవంగా ఎన్నికైన శశాంక్ మనోహర్

- శ్రీహరి