ఆటాపోటీ

డే/నైట్ టెస్టుకు ‘ట్వి లైట్’ టికెట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, మే 19: టెస్టు మ్యాచ్‌లు పగలు జరుగుతాయి. వనే్డ, టి-20 ఫార్మెట్‌లో మ్యాచ్‌లు కూడా పగలు జరిగినా, ఎక్కువ సంఖ్యలో మ్యాచ్‌లు డే/నైట్ పోటీలుగానే ఉంటాయి. కానీ టెస్టు క్రికెట్‌లోనూ డే/నైట్ మ్యాచ్‌లు రంగ ప్రవేశం చేశాయి. దీనితో ప్రేక్షకుల కోసం ‘ట్వి లైట్’ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. టెస్టు జరిగే ఐదు రోజుల్లో ప్రతి రోజూ చివరి రెండు సెషన్స్ చూసే అవకాశాన్ని కల్పించడమే ఈ ‘సంజె టికెట్ల’ ప్రత్యేకత. నిరుడు అడెలైడ్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి డే/నైట్ టెస్టు జరిగింది. చివరి రెండు సెషన్స్ కోసం ప్రత్యేకంగా ‘ట్వి లైట్’ టికెట్లను ప్రవేశపెట్టినప్పటికీ, అంతగా ప్రచారం లభించకపోవడంతో 14 శాతం టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈఏడాది డిసెంబర్ 15 నుంచి 19 వరకు పాకిస్తాన్‌తో జరిగే మొదటి కామనె్వల్త్ బ్యాంక్ డే/నైట్ టెస్టు మ్యాచ్‌కి ‘టి లైట్’ టికెట్లను విడుదల చేశారు. అడెలైడ్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, అన్నింటికీ ఒకే ధరను కాకుండా, మూడు క్లాసులుగా ఈ టికెట్లను విభజించారు. సాధారణ టికెట్ ధరను 20 ఆస్ట్రేలియా డాలర్లు (సుమారు 1000 రూపాయలు)గా నిర్ధారించారు. పిల్లల కోసం ప్రత్యేక 10 ఆస్ట్రేలియా డాలర్ల (సుమారు 500 రూపాయలు) విలువైన టికెట్లను విడుదల చేశారు. అదే విధంగా కుటుంబాలకు టికెట్ ధరగా 45 ఆస్ట్రేలియా డాలర్లు (సుమారు 2,250 రూపాయలు) వసూలు చేస్తున్నారు. మూడు రకాలు టికెట్ల అమ్మకం వల్ల ప్రేక్షకాదరణ పెరుగుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ మైక్ మెక్‌కెనా తెలిపాడు.
భారత్ సానుకూలం
డే/నైట్ టెస్టు మ్యాచ్‌ని ఆడేందుకు భారత్ సుముఖంగా ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ అన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఇది వరకే తమకు ఈ ప్రతిపాదన చేసిందని విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. వచ్చే ఏడాది రెండు దేశాల మధ్య టెస్టు సిరీస్ జరుగుతుందని, ఆ సమయంలో డే/నైట్ టెస్టు ఆడే అవకాశం ఉంటుందని చెప్పాడు. ఇలావుంటే, న్యూజిలాండ్‌తో ఈఏడాది అక్టోబర్-నవంబర్ మాసాల్లో జరిగే సిరీస్‌లో డే/నైట్ టెస్టు ఉంటుందని బిసిసిఐ ఇది వరకే ప్రకటించింది. సదర్లాండ్ పరోక్షంగా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. తమకు కూడా బిసిసిఐ నుంచి లాంటి ప్రతిపాదన వచ్చిందన్నాడు. చాలా దేశాలు డే/నైట్ టెస్టులకు సానుకూలత వ్యక్తం చేయడం శుభసూచకమని అన్నాడు. గత ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి డే/నైట్ టెస్టు జరిగింది.