ఆటాపోటీ

టాప్ స్కోరర్ లారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా ఇంగ్లీష్ కౌంటీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. 1994లో ఎడ్జిబాస్టన్‌లో జరిగిన దర్హంతో జరిగిన మ్యాచ్‌లో వార్విక్‌షైర్ తరఫున ఆడిన అతను అజేయంగా 501 పరుగులు సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనూ ఇదే అత్యధిక స్కోరు. హనీఫ్ మహమ్మద్ 499 పరుగులతో నెలకొల్పిన రికార్డును లారా బద్దలు చేశాడు. ఇంగ్లీష్ కౌంటీల విషయానికి వస్తే, లారా తర్వాత రెండో స్థానాన్ని 1895లో సోమర్‌సెట్‌పై 424 పరుగులు చేసిన ఆర్చీ మెక్‌లారెన్ ఆక్రమించాడు. గ్రేమ్ హిక్ సోమర్‌సెట్‌పై వర్సెస్టర్‌షైర్ తరఫున 405 (నాటౌట్) పరుగులు చేసి, ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

మేటి బౌలర్ బేడీ
ఇంగ్లీష్ కౌంటీలు ఆడిన భారత బౌలర్లలో మేటి బిషన్ సింగ్ బేడీ. అతను 102 మ్యాచ్‌లు ఆడాడు. 3,595.3 ఓవర్లు బౌల్ చేశాడు. వీటిలో 1,180 మెయిడిన్లు. 8,340 పరుగులిచ్చి 394 వికెట్లు పడగొట్టాడు. 34 పరుగులకు 7 వికెట్లు అతని అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణ. రెండు వందలకు మించి వికెట్లు సాధించిన వారిలో దిలీద్ దోషి (73 మ్యాచ్‌ల్లో 246), మురళీ కార్తీక్ (60 మ్యాచ్‌ల్లో 220 వికెట్లు) ఉన్నారు. వందకు పైగా వికెట్లు కూల్చిన భారతీయుల జాబితాలో అనీల్ కుంబ్లే (32 మ్యాచ్‌ల్లో 169), వెంకటరాఘవన్ (40 మ్యాచ్‌ల్లో 154), జవగళ్ శ్రీనాథ్ (23 మ్యాచ్‌ల్లో 123), కపిల్ దేవ్ (40 మ్యాచ్‌ల్లో 103), అబ్దుల్ కర్దార్ (39 మ్యాచ్‌ల్లో 103) ఉన్నారు. కాగా, ఇంగ్లీష్ కౌంటీల్లో ఎక్కువ పర్యాయాలు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు కూల్చిన ఘనత బేడీకి దక్కుతుంది. అతను 23 పర్యాయాలు ఈ ఫీట్ సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో ఉత్తమ బౌలింగ్ విశే్లషణ జవగళ్ శ్రీనాథ్‌ది. అతను 76 పరుగులకు తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. జహీర్ ఖాన్ 138 పరుగులకు తొమ్మిది వికెట్లు కూల్చాడు.

బౌలింగ్‌లో ‘వెరైటీ’!
ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టడం అద్భుతం. జీవితకాలంలో ఈ ఫీట్‌ను ఒకసారి నమోదు చేయడమే కష్టం. అలాంటిది రెండు పర్యాయాలు పది వికెట్లు పడగొట్టిన ఘనత హెడ్లీ వెరైటీకి దక్కుతుంది. ఇంగ్లీష్ కౌంటీల్లో యార్క్‌షైర్ తరఫున ఆడిన అతను వర్సెస్టర్‌షైర్‌పై 1931లో మొదటిసారి, 1932లో నాటింహామ్‌షైర్‌పై రెండోసారి అతను ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్లు చొప్పున కూల్చాడు. లీసెస్టర్ బౌలర్ జార్జి గియరీ (గ్లామర్‌గాన్‌పై 1929లో), కెంట్‌కు చెందిన కొలిన్ బ్లైత్ (నార్తాంప్టన్‌షైర్పై 1907లో), ఎసెక్స్ బౌలర్ హారీ పికెట్ (లీసెస్టర్‌షైర్‌పై 1895లో), యార్క్‌షైర్ బౌలర్ ఆలోన్జ్ డ్రేక్ (సోమర్‌సెట్‌పై 1914లో), గ్లూసెస్టర్‌షైర్ బౌలర్ జార్జి డెనెట్ (ఎసెక్సపై 1906లో), డెర్బీషైర్‌కు చెందిన విలియమ్ ‘బిల్లీ’ బెస్ట్‌విక్ (గ్లామర్‌గాన్‌పై 1921లో), మిడిల్‌సెక్స్ బౌలర్ గబీ అలెన్ (లాంకషైర్‌పై 1929లో) ఈ ఫీట్‌ను తమతమ ఖాతాల్లో వేసుకున్నారు.

- సత్య