ఆటాపోటీ

భారత్ ఏ విధంగా రాణిస్తుందో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు గ్రాండ్ శ్లామ్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ ఈనెల 27న ఆరంభం కానుండగా, నిరుడు మూడు టైటిళ్లు సాధించిన భారత్ ఈసారి ఏ విధంగా రాణిస్తుందోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. జూలై 10వ తేదీ వరకు జరిగే 130వ వింబుల్డన్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన నొవాక్ జొకోవిచ్, సెరెనా విలియమ్స్ డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగనున్నారు. క్యాలెండర్ శ్లామ్ కోసం ప్రయత్నిస్తున్న జొకోవిచ్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నిలబెట్టుకునే అవకాశాలున్నాయి. రాఫెల్ నాదల్ మణికట్టు గాయంతో వైదొలగ్గా, నిరుడు రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ ఫిట్నెస్ సమస్య నుంచి పూర్తిగా బయటపడిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జొకోవిచ్ మరోసారి విజేతగా నిలిచి, క్యాలెండర్ శ్లామ్ దిశగా అడుగు ముందుకేస్తాడని విశే్లషకుల అంచనా. ఫెదరర్‌ను 7-6, 6-7, 6-4, 6-3 తేడాతో ఓడించి నిరుడు టైటిల్ సాధించిన జొకోవిచ్‌కు ఈసారి ఫైనల్‌లో ఆండీ ముర్రే ఎదురుపడవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాగా, కెరీర్‌లో 22వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకొని స్ట్ఫెగ్రాఫ్ రికార్డును సమం చేసే ప్రయత్నంలో ఉన్న సెరెనా నిరుడు మహిళల సింగిల్స్ ఫైనల్‌లో గార్బినె ముగురుజాను 6-4, 6-4 ఆధిక్యంతో ఓడించి టైటిల్ అందుకుంది. అయితే, ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో ఆమె ముగురుజా చేతిలో 5-7, 4-6 తేడాతో ఓటమిపాలైంది. వింబుల్డన్‌లో వీరిద్దరు మరోసారి టైటిల్ పోరు వరకూ చేరతారో లేదో చూడాలి. నిరుడు మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా, మిక్స్‌డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్, బాలుర డబుల్స్‌లో సుమీత్ నాగల్ భారత్‌కు టైటిళ్లను అందించారు. మహిళల డబుల్స్ విభాగంలో మార్టినా హింగిస్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా ఫైనల్‌లో ఎకతరీన మకరవా, ఎలెనా వెస్నినా జోడీని 5-7, 7-6, 7-5 తేడాతో ఓడించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో మార్టినా హింగిస్‌తోనే కలిసి ఆడిన పేస్ ఫైనల్‌లో అలెగ్జాండర్ పెయా, తిమియా బబోస్ జోడీని 6-1, 6-1 ఆధిక్యంతో చిత్తుచేశాడు. బాలుర డబుల్స్‌లో లీ హొయాంగ్ నమ్‌తో కలిసి బరిలోకి దిగిన సుమీత్ ఫైనల్‌లో రిలీ ఓపెల్క, అకిరా సాంటిలాన్ జోడీపై 7-6, 6-4 స్కోరుతో గెలిచాడు. ఈసారి భారత్‌కు ఎన్ని టైటిళ్లు అందుతాయో చూడాలి.

చిత్రాలు సానియా, పేస్