ఆటాపోటీ

బ్లాక్ డైమండ్ ఆల్థియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింబుల్డన్‌లో శే్వత జాతీయుల ఆధిపత్యానికి గండికొట్టిన తొలి క్రీడాకారిణి ఆల్థియా గిబ్సన్. 1957 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఆమె డార్లెన్ హార్డ్‌పై 6-3, 6-2 తేడాతో విజయభేరి మోగించింది. వింబుల్డన్ టైటిల్ సాధించిన తొలి నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించింది. అంతకు ముందే ఆమె ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో ఏంజెలా మోర్టిమెర్‌ను ఓడించి, తొలి గ్రాండ్ శ్లామ్‌ను సాధించింది. టైటిల్ గెలవడం పక్కకు ఉంచితే, మహిళలు లేదా పురుషుల విభాగాల్లో అప్పటి వరకూ ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి నల్లజాతీయులు ఎవరూ అడుగుపెట్టలేదు. 1958లో మరోసారి వింబుల్డన్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న ఆల్థియాకు హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం కూడా లభించింది.
***
మహిళల్లో ఫస్ట్ వౌడ్ వాట్సన్
మహిళల సింగిల్స్‌తోపాటు పురుషుల డబుల్స్ విభాగంలో పోటీలను 1884లో ప్రవేశపెట్టారు. మహిళల సింగిల్స్ ఫైనల్‌లో లిలియన్ వాట్సన్‌పై 6-8, 6-3, 6-3 తేడాతో గెలిచిన వౌడ్ వాట్సన్ మొదటి వింబుల్డన్ మహిళా సింగిల్స్ విజేతగా రికార్డు పుస్తకాల్లోకి స్థానం సంపాదించింది. అదే ఏడాది ప్రవేశపెట్టిన పురుషుల డబుల్స్‌లో విలియమ్ రెన్షా, ఎర్నెస్ట్ రెన్షా జోడీ 6-3, 6-1, 1-6, 6-4 ఆధిక్యంతో ఎర్నెస్ట్ లూయిస్, టెడ్డీ విలియమ్స్ జోడీపై గెలుపొంది టైటిల్ అందుకుంది. కాగా, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్స్‌లో పోటీలు 1913లో మొదలయ్యాయి.
సటన్ రికార్డు
వింబుల్డన్‌లో ఐరోపా దేశాల ఆధిపత్యం చాలాకాలం కొనసాగింది. 1905లో మే గాడ్‌ఫ్రే సటన్ టైటిల్ సాధించి సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఆమె డొరోథియా డగ్లస్‌ను 6-3, 6-4 తేడాతో ఓడించి, వింబుల్డన్‌లో విజేతగా నిలిచిన ఐరోపాకు చెందని తొలి క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.
**
తొలి విజేత స్పెన్సర్
మొట్టమొదటి వింబుల్డన్ 1877లో ఔత్సాహికులకు మాత్రమే పరిమితమైన టోర్నీగా మొదలైంది. పురుషుల సింగిల్స్ ఒకే ఒక విభాగంలో పోటీలను నిర్వహించారు. 22 మంది పోటీపడ్డారు. విలియమ్ మార్షల్‌ను 6-1, 6-2, 6-4 తేడాతో ఓడించిన స్పెన్సర్ గోరె తొలి టైటిల్‌ను గెల్చుకున్నాడు. అదే అతనికి మొదటి, చివరి వింబుల్డన్ టైటిల్. రెండో స్థానానికి జరిగిన పోరులో విలియమ్ మార్షల్ 6-4, 6-4 స్కోరుతో చార్లెస్ గిల్బర్ట్‌పై విజయం సాధించాడు.

- శ్రీహరి