ఆటాపోటీ

వనె్న తగ్గని కౌంటీ క్రికెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇ ంగ్లీష్ కౌంటీ క్రికెట్ నిత్యనూతనంగా వర్ధిల్లుతున్నది. 125 వసంతాలను పూర్తి చేసుకున్నప్పటికీ వనె్న తగ్గకుండా అభిమానులను అలరిస్తునే ఉంది. వనే్డ, టి-20 ఫార్మెట్స్ పుట్టుకొచ్చినప్పటికీ నాలుగు రోజుల కౌంటీ క్రికెట్ నేటికీ క్రికెటర్లకు పాఠాలు నేర్పిస్తూ వారిని మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతున్నది. కౌంటీ క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్), బిగ్‌బాష్ లాంటి టోర్నీలో కనిపించే చీర్ లీడర్ల చిందులు కనిపించవు. కానీ, స్థానికులతోపాటు వివిధ దేశాలకు చెందిన ప్రతిభావంతులైన ఆటగాళ్ల నైపుణ్యాన్ని తిలకించే అవకాశం ఉంటుంది. కౌంటీ క్రికెట్‌కు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇప్పటికీ క్రికెట్ సంప్రదాయాలను పాటిస్తున్న ఏకైక క్రికెట్ వేదిక ఇదే. క్రికెట్‌లో వనే్డ ఇంటర్నేషనల్స్, టి-20 వంటి పొట్టి ఫార్మెట్స్ వచ్చిపడ్డాయి. టెస్టుల్లోనూ డే/నైట్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. ఎర్ర బంతుల స్థానంలోనే తెలుపు, గులాబీ రంగు బంతు వస్తున్నాయి. ఈ మార్పులకు పవర్ గేమ్ కూడా జత కలిసింది. కళాత్మక ఆటకు తెరపడింది. బౌలర్లపై బ్యాట్స్‌మెన్ ఆధిపత్యమే క్రికెట్‌కు పర్యాయపదమైంది. క్రికెట్‌లో హుందాతనం ఎక్కడ? అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది
క్రికెట్‌లో హుందాతనం ఎక్కడా కనిపించడం లేదు. ‘జంటిల్మన్ గేమ్’ క్రమంగా ఆ హోదాకు దూరమవుతున్నది. ఆరో ఐపిఎల్‌లో బట్టబయలైన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో క్రికెట్‌లో విలువలు పతనమవుతున్నాయ. దీని వల్ల ఐపిఎల్ టోర్నీలకు ఎలాంటి ఇబ్బంది లేకయనా, క్రికెట్‌కు, ప్రత్యేకించి టెస్టు, కౌంటీ వంటి సంప్రదాయ క్రికెట్‌కు నష్టం వాటిల్లుతుంది. ఐపిఎల్ వంటి టోర్నీలకు భారత్‌లో విపరీతమైన ఆదరణ ఉంది. ప్రజలు ఎంత భయంకరమైన సంఘటనైనా త్వరగానే మరచిపోతారు. కాబట్టి స్పాట్ ఫిక్సింగ్ సంఘటన వల్ల ఐపిఎల్‌కు వచ్చిన ప్రమాదం లేదు. స్టేడియాలు నిండుతాయి. కానీ, క్రికెట్‌కే తీవ్ర నష్టం వాటిల్లుతోంది. హుందాతనాన్ని కోల్పోయింది. ఇప్పుడు క్రికెట్‌ను డబ్బు శాసిస్తున్నది. అద్భుతమైన ఒక క్రీడ ఈ విధంగా వ్యాపారంగా మారడం దురదృష్టకరం. ఒకప్పుడు బ్యాట్స్‌మన్ అవుటైందీ కానిదీ తేల్చులేక అంపైర్ ఇబ్బంది పడుతుంటే, సదరు బ్యాట్స్‌మన్ స్వచ్ఛందంగా పెవిలియన్‌కు వెళ్లిపోయేవాడు. తాను అవుటైనట్టు అనుమానం వస్తే, అంపైర్ నిర్ణయం ప్రకటించక ముందే మైదానాన్ని వీడి వెళ్లే గుండప్ప విశ్వనాథ్ వంటి ఎంతోమంది ఆటగాళ్లు క్రికెట్‌కు గొప్ప పేరుప్రఖ్యాతులు ఆర్జించి పెట్టారు. క్రికెట్‌ను ‘జంటిల్మన్ గేమ్’ అని ఎందుకు అంటారో అలాంటి క్రికెటర్లు నిరూపించారు, కానీ ఈ రోజుల్లో అలాంటి వాతావరణం కనిపించడం లేదు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఐపిఎల్‌ను రద్దు చేయాలన్న డిమాండ్‌కు సరైన పునాది లేదు. నిజానికి ఈ టోర్నీవల్ల క్రికెటర్లకు మేలు జరుగుతున్నది. యువ ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడంతోపాటు, విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడే అనుభవాన్ని కూడా సంపాదించుకోగలుగుతున్నారు. అయితే, ఫిక్సింగ్ వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. పారదర్శకంగా మ్యాచ్‌లు జరిగే, ఐపిఎల్ వల్ల లాభమే తప్ప నష్టం లేదు.
18 జట్లు
ఇంగ్లీష్ కౌంటీలో మొత్తం 18 జట్లు ఉన్నాయి. వీటిలో డెర్బీషైర్ బలమైనది. దర్హం, ఎసెక్స్, గ్లామర్‌గాన్, గ్లూసెస్టర్‌షైర్, హాంప్స్‌షైర్, కెంట్, లాంకషైర్, లీసెస్టర్‌షైర్, మిడిల్‌సెక్స్, నార్తాంప్టన్‌షైర్, నాటింహామ్‌షైర్, సోమర్‌సెట్, సర్రే, ససెక్స్, వార్విక్‌షైర్, వర్సెస్టర్‌షైర్, యార్క్‌షైర్ జట్లు కూడా కౌంటీ క్రికెట్‌కు బలమైన పునాదులు వేశాయి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో, ఆతర్వాత కౌంటీ క్రికెట్‌కు తరలివచ్చే ప్రేక్షకులు తగ్గారు. ఫలితంగా 1970, 1980 దశకాల్లో వనే్డ క్రికెట్ ఫార్మెట్ ఇంగ్లాండ్‌లో వేళ్లూనుకుంది. ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను పక్కకుపెడితే, టెస్టులకు, కౌంటీ మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒకనొక దశలో కౌంటీ క్రికెట్‌కు నూకలు చెల్లాయని, భవిష్యత్తులో ఇది పూర్తిగా కనుమరుగవుతుందన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, అలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. క్రికెట్‌ను టెక్నిక్‌తో కాకుండా పశుబలంతో ఆడే విధానాన్ని చూస్తూ కేరింతలు కొట్టే వారు ఎంత మంది ఉన్నారో.. ఆ క్రీడ వౌలిక సూత్రాలను దృష్టిలో ఉంచుకొని ప్రదర్శించే కళాత్మక ఆట కోసం స్టేడియాలకు వచ్చే అభిమానులు కూడా అంతే మంది ఉంటున్నారు. హాంప్స్‌షైర్‌లో గార్డెన్ గ్రీనిడ్జ్, మాల్కం మార్షల్, సోమర్‌సెట్‌లో వివియన్ రిచర్డ్స్, జోల్ గార్నర్ వంటి హేమాహేమీలు ఆడేవారు. అందుకే, వనే్డ ఇంటర్నేషనల్ ఫార్మెట్ క్రికెట్‌ను కుదిపేసిన రోజుల నుంచి నేడు శాసిస్తున్న స్థాయికి చేరుకున్నప్పటికీ కౌంటీ క్రికెట్ ప్రాభవం కొనసాగుతున్నది.
ఐపిఎల్‌తో పెనుమార్పులు
ఇంగ్లీష్ కౌంటీల నుంచి మొదలుపెడితే యూరోపియన్ సాకర్ చాంపియన్‌షిప్ వరకూ వివిధ క్రీడలు.. వివిధ టోర్నీల్లోని కీలక అంశాలను, ప్రధానంగా ప్రేక్షకులను స్టేడియాలకు రప్పించే మార్గాలను అనే్వషించి, పరిశోధించిన తర్వాత రూపుదిద్దుకున్న ఐపిఎల్ యావత్ క్రికెట్ రంగంలోనే పెను మార్పులకు కారణమైంది. క్రికెట్‌ను ఈటోర్నీ వ్యాపారంగా మార్చేసింది. ఆటగాళ్లకు భారీ మొత్తాలను ఎరగా చూపించి ఆకర్షించింది. డబ్బు కోసం మాజీ, ప్రస్తుత క్రికెటర్లంతా ఐపిఎల్‌లో స్థానం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఒకానొక దశలో ఐపిఎల్ కారణంగా కౌంటీ క్రికెట్ మూతపడే ప్రమాదం కనిపించింది. కానీ, అటు క్రికెటర్లు, ఇటు అభిమానులు కూడా క్రమంగా పరమిత ఓవర్ల ఫార్మెట్స్‌కు దూరమవుతున్నారు. కౌంటీ క్రికెట్ మళ్లీ ఒక గాడిలో పడింది. ఈసారి ఐపిఎల్, కౌంటీ క్రికెట్ చాంపయన్‌షిప్ దాదాపు ఒకేసారి మొదలయ్యాయి. ఐపిఎల్‌తో సమానంగా కౌంటీలకు అభిమానులు వెల్లువెత్తడం శుభసూచకం. కళాత్మక క్రికెట్‌కు మళ్లీ మంచిరోజులు వచ్చాయనడానికి ఇదో నిదర్శనం. క్రికెట్‌కు వినోదాల రంగులద్ది, భారీ పారితోషికాల సుగంధాన్ని చిలకరించి, ఒక మెగా టోర్నీగా తీర్చిదిద్దితే అది ఐపిఎల్ అవుతుంది. ఆటగాళ్లకు భారీ పారితోషికాలు ఐపిఎల్ ప్రత్యేకత. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఎంతోమంది క్రికెటర్లు ఇప్పటికీ ఐపిఎల్‌లో ఆడడానికి అదే ప్రధాన కారణం. బిసిసిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో ఎన్ని వివాదాలు చోటు చేసుకున్నా ఆదరణ పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులు దేశ క్రికెట్ పునాదులనే కదిలించినా, గత ఏడాది ఏడో ఐపిఎల్ సజావుగానే సాగింది. ఇప్పుడు ఎనిమిదో ఐపిఎల్ ముస్తాబవుతున్నది. ఈ టోర్నమెంట్‌కు ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. ఒక్కసారి ఐపిఎల్‌లో ఆడితే, జీవితాంతం మరో టోర్నీ ఆడాల్సిన అవసరం లేనంత సంపాదించుకోవచ్చని క్రికెటర్ల అభిప్రాయం. ఏదైనా ఫ్రాంచైజీలోకి వెళితేచాలు.. మ్యాచ్‌లు ఆడకపోయినా భారీగానే సొమ్ము దక్కుతుంది. వీరాభిమానుల తీరు మారే వరకూ ఐపిఎల్ ఎదుగుదలకు ఆటంకం ఉండదు. వివాదాల పుట్ట, అక్రమాల నిలయంగా ఈటోర్నీని విమర్శిస్తున్న వారు లేకపోలేదు. కానీ, వారి ఆవేదన అరణ్య రోదనగానే మారింది. ఐపిఎల్ క్రికెట్ క్రీడకు నష్టం చేస్తున్నదన్న వారి వాదనను ఎవరూ పట్టించుకోవడం లేదు. మిగతా అన్ని ఫార్మెట్లు, సిరీస్‌లు, టోర్నీలు ఐపిఎల్ చక్రాల కిందపడి నలిగిపోతున్నాయి. భవిష్యత్తు కనిపించక అల్లాడుతున్నాయి. ఐపిఎల్ మాత్రం జైత్రయాత్రను కొనసాగిస్తునే ఉంది. ఇటీవలే పరిస్థితి క్రమంగా మారుతున్నది ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ కూడా పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నది. ఇప్పుడు ఐపిఎల్‌తో పాటు కౌంటీ చాంపియన్‌షిప్ జరుగుతున్నది. ఇంగ్లాండ్ అభిమానులంతా ఐపిఎల్ కంటే కౌంటీ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారని టీవీ టిఆర్‌పి రేటింగ్స్ స్పష్టం చేస్తున్నాయ.
--
కౌంటీల్లో ఆడటం వల్లే..
వనే్డ జట్టులో స్థానం కోల్పోయన తర్వాత కౌంటీలలో ఆడటంతో తమ ఆటతీరు మెరుగైందని చాలా మంది అంటారు. కొత్త షాట్లు ఆడటం నేర్చుకున్నామని చెప్తారు. దాంతో ఇవే షాట్లను టెస్టులలో కూడా ఆడగలననే ఆత్మవిశ్వాసం వారికి వస్తుంది. ఫామ్ కోల్పోయినప్పుడు కౌంటీ క్రికెట్‌తోనే మళ్లీ ఫామ్‌కి వచ్చే అవకాశం ఉంటుంది.
--
సూపర్ యార్క్‌షైర్
ఇంగ్లీష్ కౌంటీల్లో యార్క్‌షైర్ జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. మొత్తం 32 పర్యాయాలు టైటిళ్లు సాధించిన ఈ జట్టు ఒకసారి సంయుక్త విజేతగా నిలిచింది. రెండో స్థానంలో సర్రే ఉంది. ఆ జట్టు 18 టైటిళ్లను కైవసం చేసుకోగా, ఒకసారి షేర్ చేసుకుంది. మిడిల్‌సెక్స్ 10 టైటిళ్లను సాధించి, రెండు సార్లు ట్రోఫీని పంచుకుంది. లాంకషైర్ ఎనిమిది సార్లు విజేతగా, ఒకసారి సంయుక్త విజేతగా నిలిచింది. వర్సెస్టర్‌షైర్ ఏడు, కెంట్, ఎసెక్స్, నాటింహామ్‌షైర్ ఆరేసి సార్లు టైటిల్ సాధించాయి. కెంట్ ఆరు టైటిళ్లతోపాటు ఒకసారి సంయుక్త విజేతగా అవతరించింది.
--
పరుగుల హోరు
ఇంగ్లీష్ కౌంటీల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు రికార్డు యార్క్‌షైర్ పేరు మీద ఉంది. 1896 మే 7, 8, 9 తేదీల్లో వర్సెస్టర్‌షైర్‌తో ఎడ్జిబాస్టన్‌లో జరిగిన మూడు రోజుల మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 887 పరుగులు సాధించింది. బాబీ పీల్ 210 (నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా, మరో ముగ్గురు బ్యాట్స్‌మెన్, స్టాన్లీ జాక్సన్ (117), టెడ్ వెయిన్‌రైడ్ (126), కెప్టెన్ లార్డ్ హాక్ (166) శతకాలతో రాణించారు. 1990లో సర్రేపై జరిగిన మ్యాచ్‌లో లాంకషైర్ 863, మిడిల్‌సెక్స్‌పై 2007లో జరిగిన మ్యాచ్‌లో సోమర్‌సెట్ 850 (ఏడు వికెట్లకు డిక్లేర్డ్) పరుగులు సాధించి వరుసగా రెండు, మూడు స్థానాలను ఆక్రమించాయి. 800లకు పైగా పరుగులు చేసిన జట్లలో సర్రే (సోమర్‌సెట్‌పై 1899లో), వార్విక్‌షైర్ (దర్హంపై 1994లో), కెంట్ (ఎసెక్సపై 1934లో), డెర్బీషైర్ (సోమర్‌సెట్‌పై 2007లో) ఉన్నాయి.

- బిట్రగుంట