ఆటాపోటీ

ఒలింపిక్స్ జైత్రయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు 1896లో ఏప్రిల్ 6 నుంచి 15 వరకూ ఏథెన్స్ వేదికగా జరిగాయి. పురాతన ఒలింపిక్స్ గ్రీస్‌లో జరగడం వల్ల, ఆధునిక ఒలింపిక్స్‌ను అక్కడి నుంచే ప్రారంభించాలని అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐసిసి) నిర్ణయించింది. మొత్తం తొమ్మిది క్రీడల్లో (43 క్రీడాంశాలు) 13 దేశాలు పోటీపడ్డాయి. 311 మంది అథ్లెట్లు పాల్గొనగా, అందరూ పురుషులే. ప్రాచీన ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని మొదటి ఒలింపిక్స్‌లో మహిళలను అనుమతించలేదు. అమెరికా అత్యధికంగా 11 స్వర్ణాలతో అగ్రస్థానం దక్కించుకుంది. గ్రీస్ 19 రజతం, 19 కాంస్యాలు సహా మొత్తం 47 పతకాలు సాధించినప్పటికీ, స్వర్ణాల సంఖ్య పదే కావడంతో ద్వితీయ స్థానానికి పడిపోయింది. జర్మనీ తృతీయ స్థానాన్ని ఆక్రమించింది.
పారిస్ (ఫ్రాన్స్) ఒలింపిక్స్ 1900లో మే 14 నుంచి అక్టోబర్ 28 వరకూ జరిగాయి. 22 దేశాలకు చెందిన 1,319 మంది పురుషులు, 11 మంది మహిళలు మొత్తం 17 క్రీడల్లో (166 క్రీడాంశాలు) పోటీపడ్డారు. ఫ్రాన్స్ 29 స్వర్ణాలు, 41 రజతాలు, 32 కాంస్యాలతో మొత్తం 102 పతకాలు కైవసం చేసుకుంది. ఒలింపిక్స్‌లో చరిత్రలో మొట్టమొదటిసారి వందకుపైగా పతకాలు సాధించిన దేశంగా రికార్డు సృష్టించింది.
జూలై 1 నుంచి నవంబర్ 23 వరకూ వివిధ దశల్లో జరిగిన 1904 సెయింట్ లూయిస్ ఒలింపిక్స్‌ను పలు దేశాలు బహిష్కరించగా, 12 దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. 14 క్రీడల్లో (104 క్రీడాంశాలు) 681 మంది పురుషులు, ఆరుగురు మహిళలు పతకాల కోసం వేట సాగించారు. అమెరికా 80 స్వర్ణం, 86 రజతం, 72 కాంస్య పతకాలతో మొత్తం 238 పతకాలను సాధించింది. ఒలింపిక్స్‌లో రెండు వందలకుపైగా పతకాలు సాధించిన తొలి దేశంగా రికార్డు నెలకొల్పింది.
1908 ఏప్రిల్ 27 నుంచి అక్టోబర్ 31 వరకూ 1908 ఒలింపిక్స్ లండన్‌లో జరిగాయి. ఈసారి కూడా పోటీలను దశల వారీగా నిర్వహించారు. 21 క్రీడాంశాల్లో 110 స్వర్ణాల కోసం జరిగిన పోరులో 23 దేశాలకు చెందిన 2,035 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. వీరిలో 1999 మంది పురుషులుకాగా, మిగతా 36 మంది మహిళలు. బ్రిటన్ 56 స్వర్ణం, 50 రజతం, 39 కాంస్యాలతో మొత్తం 145 పతకాలు గెల్చుకొని అగ్రస్థానంలో నిలిచింది.
స్టాక్‌హోమ్స్ (స్వీడన్)లో మే 5 నుంచి జూలై 22 వరకూ జరిగిన 1912 ఒలింపిక్ క్రీడల్లో 28 దేశాలు పాల్గొన్నాయి. 13 క్రీడలు, 102 ఈవెంట్స్‌లో 2,490 మంది పురుషులు, 57 మంది మహిళలు పోటీకి దిగారు. స్వీడన్ 24 స్వర్ణాలు, 24 రజతాలు, 17 కాంస్యాలతో 65 పతకాలు కైవసం చేసుకొని నంబర్‌వన్‌గా నిలిచింది.
మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1920లో ఆంట్‌వెర్ప్ (బెల్జియం) ఒలింపిక్స్‌కు వేదికైంది. ఏప్రిల్ 23 నుంచి 29వ తేదీ వరకూ జరిగిన ఆ పోటీల్లో 29 దేశాలు పాల్గొన్నాయి. 2,591 మంది పురుషులు, 77 మంది మహిళలు మొత్తం 21 క్రీడల్లో 154 స్వర్ణ పతకాల కోసం పోటీపడ్డారు. అమెరికా 41 స్వర్ణం, 27 రజతం, 28 కాంస్య పతకాలతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది.
1924 మే 4 నుంచి జూలై 27 వరకూ పారిస్ (ఫ్రాన్స్)లో ఎనిమిదో ఒలింపిక్స్ జరిగాయి. 44 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో మొత్తం 18 క్రీడల్లో, 126 స్వర్ణ పతకాల కోసం 2,956 మంది పురుషులు, 136 మంది మహిళలు పోటీపడ్డారు. అమెరికా 45 స్వర్ణం, 27 రజతం, 27 కాంస్యాలతో మొత్తం 99 పతకాలు కైవసం చేసుకొని నంబర్‌వన్‌గా నిలిచింది.
లాస్ ఏంజిల్ (అమెరికా)లో 1932 జూలై 30 నుంచి ఆగస్టు 14 వరకూ పదో ఒలింపిక్స్ జరిగాయి. 37 దేశాలకు చెందిన 1,281 మంది పురుషులు, 127 మంది మహిళలు మొత్తం 14 క్రీడల్లో, 117 స్వర్ణ పతకాల కోసం పోటీపడ్డారు. అమెరికా 41 స్వర్ణం, 32 రజతం, 31 కాంస్యాలతో నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది.
నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్వీయ పర్యవేక్షణలో 1936 ఒలింపిక్స్ బెర్లిన్‌లో ఆగస్టు 1 నుంచి 16వ తేదీ వరకూ జరిగాయి. 49 దేశాలు, 19 క్రీడలు, 129 క్రీడాంశాలతో ఈ ఒలింపిక్స్ కొనసాగాయి. హిట్లర్ జాత్యహంకారంపై అమెరికా నల్లజాతీయుడు జెస్సీ ఒవెన్స్ చావుదెబ్బ తీశాడు. భారత ‘హాకీ మాంత్రికుడు’ ధ్యాన్ చంద్ తన అసాధారణ ప్రతిభతో హిట్లర్‌నేకాదు... యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేశాడు. 49 దేశాలు పాల్గొన్న ఈ ఒలింపిక్స్‌లో 19 క్రీడలకు (129 క్రీడాంశాలు) 3,738 మంది పురుషులు, 328 మంది మహిళలు హాజరయ్యారు. జర్మనీ 33 స్వర్ణాలు, 26 రజతాలు, 30 కాంస్యాలతో మొత్తం 89 పతకాలు కైవసం చేసుకొని అగ్రస్థానాన్ని ఆక్రమించింది.
లండన్‌లో 59 దేశాలు పాల్గొన్న 25వ ఒలింపియాడ్ 1948 జూలై 29 నుంచి ఆగస్టు 14 వరకూ జరిగాయి. 17 క్రీడల్లో 136 స్వర్ణ పతకాల కోసం 3,714 పురుషులు, 358 మంది మహిళలు పాల్గొన్నారు. అమెరికా 38 స్వర్ణం, 27 రజతం, 19 కాంస్య పతకాలతో నంబర్‌వన్‌గా నిలిచింది.
ప్రచ్ఛన్న యుద్ధం..
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన ఏడు సంవత్సరాల తర్వాత కూడా అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ఉన్న ప్రచ్ఛన్న యుద్ధం 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌పై ప్రభావం చూపింది. జూలై 19 నుంచి ఆగస్టు 3 వరకూ జరిగిన ఈ ఒలింపిక్స్‌లో 69 దేశాలు పాల్గొన్నాయి. 17 క్రీడల్లో (149 క్రీడా విభాగాల్లో) 4,407 పురుషులు, 518 మహిళా అథ్లెట్లు పాల్గొన్నారు. అమెరికా 40 స్వర్ణం, 19 రజతం, 17 కాంస్య పతకాలతో నంబర్‌వన్‌గా నిలిచింది. సోవియట్ రష్యా 22 స్వర్ణం, 30 రజతం, 19 కాంస్య పతకాలను కైవసం చేసుకొని ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది.
అమెరికా ఆధిపత్యానికి గండి..
1956 నవంబర్ 22 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకూ జరిగిన మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో 17 క్రీడలకుగాను 151 విభాగాల్లో 67 దేశాలు పాల్గొన్నాయి. 2,813 పురుషులు, 371 మహిళలు పాల్గొన్నారు. సోవియట్ రష్యా 37 స్వర్ణాలు, 29 రజతం, 32 కాంస్యాలతో మొత్తం 98 పతకాలను కైవసం చేసుకొని అగ్రస్థానాన్ని ఆక్రమించింది. అమెరికా ఆధిపత్యానికి రష్యా గండికొట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా ద్వితీయ స్థానానికి పరిమితమైంది.
తిరుగులేని సోవియట్
1960 రోమ్ (ఇటలీ) ఒలింపిక్స్ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 11 వరకూ జరిగాయి. 83 దేశాలకు చెందిన 4,736 పురుషులు, 610 మహిళలు 17 క్రీడల్లో (150 క్రీడాంశాలు) పాల్గొన్నారు. సోవియట్ రష్యా 43 స్వర్ణం, 29 రజతం, 31 కాంస్య పతకాలతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఉత్తర జర్మనీ, దక్షిణ జర్మనీ ఒకే జట్టుగా బరిలోకి దిగడం విశేషం. ఫలితంగా స్ప్రింట్‌లో అమెరికాకు పరాభవం ఎదురైంది.
జపాన్‌లో ఒలింపిక్స్...
1964 ఒలింపిక్స్‌కు 94 దేశాల నుంచి 4,457 మంది పురుషులు, 663 మంది మహిళలు హాజరయ్యారు. జపాన్ రాజధాని టోక్యోలో అక్టోబర్ 10 నుంచి 24వ తేదీ వరకు ఈ పోటీలు జరిగాయి. హిరోషిమాపై అమెరికా అణు బాంబు దాడి చేసిన 1945 ఆగస్టు 6వ తేదీన జన్మించిన అథ్లెట్ యషినోరోసాకీతో ఈ ఒలింపిక్ క్రీడా జ్యోతిని వెలిగింపచేయడం విశేషం. 19 క్రీడల్లో 163 స్వర్ణ పతకాల కోసం పోరుజరగ్గా, అమెరికా 36 స్వర్ణం, 26 రజతం, 28 కాంస్య పతకాలతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. సోవియట్ రష్యా తృతీయ స్థానాలు సంపాదించుకున్నాయి.
మెక్సికో సిటీ (మెక్సికో)లో 1968 ఒలింపిక్స్ జరిగాయి. 112 దేశాలకు చెందిన 5,517 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు. వీరిలో 4,735 మంది పురురషులుకాగా, 781 మంది మహిళలు. అమెరికా 45 స్వర్ణం, 28 రజతం, 34 కాంస్యాలతో మొత్తం 107 పతకాలను సాధించి అగ్రస్థానాన్ని ఆక్రమించింది.
ఒలింపిక్స్ చరిత్రలోనే 1972 మ్యూనిచ్ (పశ్చిమ జర్మనీ) ఒలింపిక్స్ విషాదాన్ని నింపిన గేమ్స్‌గా మిగిలిపోయాయి. ‘బ్లాక్ సెప్టెంబర్ మెంబర్స్’గా తమను తాము ప్రకటించుకున్న పలస్తీనా మద్దతుదారులు క్రీడా గ్రామంలోకి చొరబడి 11 మంది ఇజ్రాయిల్ అథ్లెట్లు, కోచ్‌లను బందీలుగా పట్టుకున్నారు. భద్రతా బలగాలు జరిపిన దాడిలో మొత్తం 17 మంది మృతి చెందారు. వారిలో బందీలుగా చిక్కిన ఆరుగురు ఇజ్రాయిల్ కోచ్‌లు, ఐదుగురు ఇజ్రాయిల్ అథ్లెట్లు ఉన్నారు. ఐదుగురు బ్లాక్ సెప్టెంబర్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అప్పటి పశ్చిమ జర్మనీకి చెందిన ఒక పోలీస్ అధికారి కూడా మరణించాడు. ఆ ఒలింపిక్స్‌లో 121 దేశాల నుంచి 7,134 మంది పోటీపడ్డారు. సోవియట్ యూనియన్ 50 స్వర్ణాలు, 27 రజతాలు, 22 కాంస్యాలతో మొత్తం 99 పతకాలను కైవసం చేసుకొని నంబర్ వన్‌గా నిలిచింది.
మాంట్రియల్ (కెనడా)లో 1976 ఒలింపిక్స్ జరిగాయి. 92 దేశాల నుంచి 6,084 మంది అథ్లెట్లు హాజరయ్యారు. వీరిలో 4,824 మంది పురుషులు. 1,260 మంది మహిళలు. 21 క్రీడలకు సంబంధించి 198 ఈవెంట్స్‌లో పోటీలు జరిగాయి. సోవియట్ యూనియన్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. 49 స్వర్ణాలు, 41 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 125 పతకాలు సాధించి తనకు తిరుగులేదని నిరూపించింది.
అమెరికాసహా పలు దేశాలు బహిష్కరించిన మాస్కో (సోవియట్ యూనియన్) ఒలింపిక్స్ 1980లో జరిగాయి. 80 దేశాల నుంచి 5,179 మంది 21 క్రీడలకు సంబంధించి 203 ఈవెంట్స్‌లో పోటీపడ్డారు. వీరిలో 4,064 మంది పురుషులు. 1,115 మంది మహిళలు. సోవియట్ యూనియన్ 80 స్వర్ణం, 69 రజతం, 46 కాంస్యాలతో మొత్తం 195 పతకాలను కైవసం చేసుకొని నంబర్ వన్‌గా నిలిచింది.
చివరి హాకీ స్వర్ణం
భారత హాకీ జట్టు మాస్కో ఒలింపిక్స్‌లోనే చివరిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. వాసుదేవ భాస్కరన్ నాయకత్వంలో వెళ్లిన భారత్ హాకీ జట్టు ఫైనల్‌లో స్పెయిన్‌ను ఎదుర్కొని 4-3 తేడాతో గెలిచి స్వర్ణ పతకాన్ని అందుకుంది.
లాస్ ఏంజిల్స్ (అమెరికా)లో జరిగిన 1984లో జరిగిన ఒలింపిక్స్‌లో 140 దేశాలకు చెందిన 6,828 మంది అథ్లెట్లు హాజరయ్యారు. వీరిలో 5,263 మంది పురుషులు. 1,566 మంది మహిళలు. 21 క్రీడల్లో 221 ఈవెంట్స్‌కు పోటీలను నిర్వహించారు. ఈ ఒలింపిక్స్‌ను సోవియట్ యూనియన్, దానికి మద్దతునిస్తున్న దేశాలు బహిష్కరించాయి. అమెరికా 83 స్వర్ణం, 61 రజతం, 30 కాంస్యాలతో 174 పతకాలను గెల్చుకొని నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది.
సియోల్ (దక్షిణ కొరియా)లో 1988 ఒలింపిక్స్ జరిగాయి. 159 దేశాల నుంచి 8,391 మంది హాజరయ్యారు. వీరిలో 6,197 మంది పురుషులుకాగా, 2,194 మంది మహిళలు. 23 క్రీడలకు సంబంధించి 237 విభాగాల్లో జరిగిన పోటీల్లో సోవియట్ యూనియన్ 172 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈస్ట్ జర్మనీ రెండో స్థానాన్ని సంపాదించింది. అమెరికా మూడో స్థానంతో సంతృప్తి చెందింది. పోటీలకు ఆతిథ్యమిచ్చిన దక్షిణ కొరియా నాలుగో స్థానాన్ని ఆక్రమించింది.
బార్సిలోనా (స్పెయిన్) ఆతిథ్యమిచ్చిన 1992 ఒలింపిక్స్‌లో 169 దేశాల నుంచి 9,358 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. వీరిలో 6,652 మంది పురుషులు. 2,704 మంది మహిళలు. 25 క్రీడల్లో 257 ఈవెంట్స్ జరగ్గా, కామనె్వల్త్ స్వతంత్ర దేశాలుగా గుర్తింపు పొందిన ఎస్టోనియా, లాత్వియా, లిథుయేనియాతోపాటు సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన జార్జియా కలిసి యునైటెడ్ టీంగా ఏర్పడి పోటీ పడింది. ఈ బృందం 45 స్వర్ణం, 38 రజతం, 29 కాంస్యాలతో మొత్తం 112 పతకాలను గెల్చుకొని అగ్రస్థానాన్ని ఆక్రమించింది. అమెరికా 37 స్వర్ణం, 34 రజతం, మరో 37 కాంస్యాలతో 108 పతకాలను సాధించి రెండో స్థానంలో నిలిచింది. బెర్లిన్ గోడను కూలదోసి ఒక్కటై జర్మనీగా ఏర్పడిన ఈస్ట్, వెస్ట్ జర్మనీలు 33 స్వర్ణం, 21 రజతం, 28 కాంస్యాలతో 82 పతకాలను గెల్చుకొని మూడో స్థానాన్ని సంపాదించింది.
అట్లాంటాలో జరిగిన 1996 ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్ల సంఖ్య పదివేలను దాటింది. మొత్తం 10,320 మంది పోటీపడగా, వారిలో 6,797 మంది పురుషులు. 3,523 మంది మహిళలు. అమెరికా 44 స్వర్ణం, 32 రజతం, 25 కాంస్యాలతో మొత్తం 101 పతకాలతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ ఒలింపిక్స్‌లో భారత ఆటగాడు లియాండర్ పేస్ టెన్నిస్‌లో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. పతకాల పట్టికలో చోటు సంపాదించిన భారత్‌కు 71వ స్థానం దక్కింది.
మల్లీశ్వరి రికార్డు
సిడ్నీలో ఒలింపిక్స్ 2000వ సంవత్సరంలో జరిగాయి. 199 దేశాల నుంచి 10,651 అథ్లెట్లు హాజరుకాగా, వారిలో 6,582 మంది పురుషులు, 4,069 మంది మహిళలు. 28 క్రీడల్లో 300 ఈవెంట్స్‌లో జరిగిన పోటీల్లో తెలుగు తేజం కరణం మల్లీశ్వరి సత్తా చాటింది. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకాన్ని సాధించి, ఈ ఫీట్‌ను అందుకున్న తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. కాగా, అమెరికా 37 స్వర్ణం, 24 రజతం, 32 కాంస్యాలతో మొత్తం 93 పతకాలు సాధించిన నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది.
ఆధునిక ఒలింపిక్స్ ఆరంభమైన ఏథెన్స్‌కే 2004 ఈవెంట్‌ను నిర్వహించే అవకాశం దక్కింది. 201 దేశాల నుంచి 10,625 మంది ఈ పోటీలకు హాజరయ్యారు. వీరిలో 6,296 మంది పురుషులు. 4,328 మంది మహిళలు. 28 క్రీడల్లో 301 ఈవెంట్స్‌కు జరిగిన పోటీల్లో అమెరికా 36 స్వర్ణం, 39 రజతం, 26 కాంస్యాలతో 101 పతకాలను గెల్చుకొని నంబర్ వన్ స్థానాన్ని కొనసాగించింది.
ఈ పోటీల్లో భారత షూటర్, ప్రస్తుత కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రజత పతకాన్ని సాధించాడు. పురుషుల డబుల్ ట్రాప్‌లో అతను తీవ్రంగా పోటీపడినప్పటికీ, ద్వితీయ స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. అతను అందించిన పతకంతో భారత్‌కు పతకాల పట్టికలో 65వ స్థానం దక్కింది.
చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన 2008 ఒలింపిక్స్‌లో 204 దేశాలు పాల్గొన్నాయి. 6,305 మంది పురుషులు, 4,637 మంది పురుషులు 28 క్రీడలకు సంబంధించిన 302 ఈవెంట్స్‌లో పోటీపడ్డారు. ఆతిథ్య దేశం చైనా 51 స్వర్ణం, 21 రజతం, 28 కాంస్యాలతో 100 పతకాలు సాధించి అగ్రస్థానానికి ఎగబాకింది. అమెరికా 110 పతకాలు కొల్లగొట్టినప్పటికీ, వీటిలో 36 మాత్రమే స్వర్ణం కావడంతో రెండో స్థానంతో సంతృప్తి చెందింది. ఈ ఒలింపిక్స్‌లో భారత్ ఒక స్వర్ణంసహా మొత్తం మూడు పతకాలు గెల్చుకొని 50వ స్థానాన్ని సంపాదించింది.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఏస్ షూటర్ అభినవ్ బింద్రా స్వర్ణ పతకాన్ని సాధించాడు. పురుషుల బాక్సింగ్ మిడిల్‌వెయిట్ (75 కిలోల విభాగం)లో విజేందర్ సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకోగా, రెజ్లర్ సుశీల్ కుమార్ 66 కిలోల ఫ్రీస్టయిల్‌లో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఒకే ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడు పతకాలు లభించడం అదే మొదటిసారి.
లండన్ ఒలింపిక్స్ 2012లో జరిగాయి. 204 దేశాల నుంచి 5,992 మంది పురుషులు, 4,776 మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు. 26 క్రీడల్లో 302 ఈవెంట్స్‌లో తలపడిన దేశాల్లో అమెరికా 46 స్వర్ణం, 28 రజతం, మరో 29 కాంస్యాలతో 103 పతకాలను గెల్చుకొని అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

chitram.. భారత హాకీ దిగ్గజం
మేజర్ ధ్యాన్ చంద్

బ్రెజిల్‌లో ఒలింపిక్ విలేజ్ నమూనా