ఆటాపోటీ

ప్రతిభావంతుడు ఇసర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు కాళ్లు లేకపోయినా, కృత్రిమ కాళ్లతో ఒలింపిక్స్‌లో పరిగెత్తిన అథ్లెట్‌గా ఆస్కార్ పిస్టోరియస్ రికార్డు నెలకొల్పాడు. అయితే, అంగ వైకల్యం ఉన్నప్పటికీ ఒలింపిక్స్‌లో పాల్గొనడమేకాదు.. పతకాలు సాధించిన ప్రతిభావంతుడు జార్జి ఇసర్. రైలు ప్రమాదంలో ఎడమకాలును కోల్పోయిన అతను 1904 సెయింట్ లూయిస్ ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌లో పోటీపడ్డాడు. పారలల్ బార్, లాంగ్ హార్స్, రోప్ క్లైంబింగ్ ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు గెల్చుకున్నాడు. సైడ్ హార్స్, ఆల్‌రౌండ్ విభాగాల్లో రజత పతకాన్ని సాధించాడు. హారిజంటల్ బార్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. వైకల్యాన్ని జయించి, ఒకే ఒలింపిక్స్‌లో ఏకంగా ఆరు పతకాలు సాధించడం ఇసర్ ప్రతిభకు నిదర్శనం.