ఆటాపోటీ

జపాన్ జిమ్నాస్ట్ ఉచిమురాకు ‘పోకెమాన్’ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జపాన్ జిమ్నాస్ట్, ఒలింపిక్స్ డిఫెండింగ్ చాంపియన్ కొహె ఉచిమురాకు స్మార్ట్ ఫోన్‌లో ఇటీవల సంచలనం సృష్టిస్తున్న ఆట ‘పోకెమాన్’ షాకిచ్చింది. ఫోన్‌లో ఈ ఆట ఆడుతూ మైమరచిపోయిన ఉచిమురా తనకు వచ్చిన బిల్లు చూసి అవాక్కయ్యాడు. 5,00,000 ఎన్‌లు (సుమారు 5,000 డాలర్లు) ఫోన్ బిల్లుగా చెల్లించాల్సి రావడంతో లబోదిబోమన్నాడు. విదేశాల్లో నెట్ వాడుతున్నప్పుడు ప్రత్యేక ప్యాకేజీని వేయించుకోవడం మరచిపోయానని, తన పొరపాటును క్షమించి బిల్లును తగ్గించాలని సదరు మొబైల్ కంపెనీని వేడుకున్నాడు. అసలే ఒలింపిక్, ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్.. పైగా, రియో ఒలింపిక్స్‌లో టైటిల్‌ను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మొబైల్ కంపెనీ అతని బిల్లును 5,000 ఎన్‌లకు తగ్గించింది. బతుకుజీవుడా అనుకుంటూ ఉచిమురా ‘పోకెమాన్’ను ఫోన్‌లో నుంచి డిలీట్ చేసి ఉంటాడు.