ఆటాపోటీ

తెలియకుండానే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్‌లో పాల్గొనాలంటే ఎన్నో దశల్లో ప్రతిభ కనబరచాలి. కనీసం వైల్డ్‌కార్డ్ ఎంట్రీతోనైనా బరిలోకి దిగాలి. కానీ, ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నట్టు తెలియకుండానే పోటీకి దిగి, విజేతగా నిలిచింది మార్గరెట్ అబోట్. అమెరికాకు చెందిన మార్గరెట్ 1900 పారిస్ ఒలింపిక్స్ సమయంలో అక్కడే ఎడ్గర్ డెగాస్ అండ్ అగస్టే రాడిన్‌లో చదువుతున్నది. ఒకరోజు గోల్ఫ్ టోర్నమెంట్‌లో ఆడేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ వార్తా పత్రికలో ప్రకటన చూసి, వెంటనే అప్లై చేసింది. అధికారుల నుంచి అనుమతి రావడంతో పోటీకి దిగింది. అద్వితీయ ప్రతిభ కనబరచింది. తనకు బహుమానంగా వచ్చిన పింగాణీ గినె్నతో స్వదేశానికి వెళ్లింది. అమెరికాలో అడుగుపెట్టిన వెంటనే ఘన స్వాగతం లభించిన తర్వాతగానీ ఆమెకు అసలు విషయం అర్థంకాలేదు. ఒలింపిక్స్‌లో ఒక ఈవెంట్‌ను గెల్చుకున్న తొలి అమెరికా మహిళగా తన పేరు రికార్డు పుస్తకాల్లో చేరిందని తెలిసి మార్గరెట్ ఆశ్చర్యపోయిందట.

-ఎస్‌ఎంఎస్