ఆటాపోటీ

బాస్కెట్‌బాల్ అరంగేట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాస్కెట్‌బాల్ అధికారికంగా మొట్టమొదటిసారి 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో దర్శనమిచ్చింది. బంకమట్టి, ఇసుక కలిపి తయారు చేసిన అవుట్ డోర్ కోర్టులో మ్యాచ్‌లను ఆడించారు. మ్యాచ్‌లన్నీ సజావుగానే సాగినప్పటికీ, అమెరికా, కెనడా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మాత్రం నానా కంగాళీగా మారింది. భారీ వర్షం కురవడంతో కోర్టు మొత్తం బురదమయంకాగా, బంతిని టాస్ చేయడానికి ఆటగాళ్లు నానా తంటాలు పడ్డారు. 19-8 ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత ఆమెరికా ఆటగాళ్లు బంతిని తమలో తాము క్యాచ్ ఇచ్చుకుంటూ సమయాన్ని గడిపేశారు. బురదలో జరిగిన బాస్కెట్‌బాల్ మ్యాచ్ బహుశా అదొక్కటేనేమో!