ఆటాపోటీ

రియోలో తుపాకీ సంస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరోలో తుపాకీ సంస్కృతి శ్రుతి మించుతున్నది. నగరం నడిబొడ్డున పోలీస్ బృందంపై డ్రగ్స్ మాఫియా విరుచుకుపడి కాల్పులు జరిపిన సంఘటన కలకలం రేపింది. ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందే డ్రగ్స్ మాఫియా ఏకంగా పోలీస్‌లపైనే కాల్పులకు తెగబడడం అధికారులకు, ఒలింపిక్ నిర్వాహకులకు ఆందోళన కలిగిస్తోంది. రియోలో దాదాపు ఏదో ఒక ప్రాంతంలో కాల్పుల మోత వినిపిస్తునే ఉంటుంది. అక్కడ గన్ కల్చర్ పెరిగిపోతోందని ఐక్యరాజ్య సమితి సైతం హెచ్చరించింది. కానీ, డ్రగ్స్ మాఫియాను బ్రెజిల్ సర్కారు అడ్డుకోలేకపోతున్నది. తాజా సంఘటన నేపథ్యంలో రియోను జవాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీ సంఖ్యలో భద్రతా దళాలు రియో నలుమూలల మోహరించాయి. ప్రత్యేకించి ఒలింపిక్ వేదికలున్న ప్రాంతాల్లో జవాన్లు కవాతు చేస్తున్నారు. నగరంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే, ఏ క్షణంలోనైనా డ్రగ్స్ మాఫియా చెలరేగిపోయే ప్రమాదం కనిపిస్తున్నది. పరిస్థితి అదుపులోనే ఉందని, ఒలింపిక్స్ విజయవంతమవుతాయని బ్రెజిల్ తాత్కాలిక అధ్యక్షుడు మైఖేల్ టెమర్ చేస్తున్న ప్రకటనలను ఎవరూ నమ్మడం లేదు.