ఆటాపోటీ

రెండు క్యాప్‌లు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా ఈవెంట్స్‌లో, ప్రత్యేకంగా ఒలింపిక్స్‌లో స్విమ్మర్లు చాలా మంది రెండేసి క్యాప్‌లు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి ప్రత్యేక కారణం ఉందా అంటే ఉందనే సమాధానం వస్తున్నది. మొదట లేటెక్స్ క్యాప్‌ను పెట్టుకునే స్విమ్మర్లు దానిపైన సిలికాన్ క్యాప్‌ను ధరిస్తారు. నీటిలో కళ్లకు రక్షణగా పెట్టుకునే గాగుల్స్ హఠాత్తుగా కింద పడకుండా ఉండేందుకు రెండు క్యాప్స్‌ను స్విమ్మర్లు వాడుతున్నారు. మొదటి క్యాప్‌పైన, రెండో క్యాప్ కింద గాగుల్స్‌ను ఉంచడం వల్ల అవి కిందపడే అవకాశం లేదు. రెండేసి క్యాప్స్ పెట్టుకోవడానికి ఇది ఒక కారణమైతే, వాటి వల్ల స్విమ్మర్ల ప్రదర్శన మెరుగుపడుతుందనేది మరో కారణం. సిలికాన్ క్యాప్స్ నీటిలో ముడతలు పడవు. ఫలితంగా స్విమ్మర్లకు ఏమాత్రం అసౌకర్యంగా ఉండదు. సిలికాన్ క్యాప్ అంత మంచిదైతే, త్వరగా ముడతలు పడే లేటెక్స్ క్యాప్‌ను ఎందుకు ధరిస్తున్నారు? ఈ ప్రశ్నకు కూడా స్విమ్మింగ్ నిపుణుల వద్ద సమాధానం ఉంది. తలకు గట్టిగా అతుక్కుపోయే లేటెక్స్ క్యాప్ తొందరగా పడిపోదు. సిలికాన్ క్యాప్ ఒక్కోసారి జారిపోయే ప్రమాదం ఉంది. అందుకే తలకు అనుకూలంగా ఉండేందుకు లేటెక్స్ క్యాప్‌ను, మెరుగైన ప్రదర్శనతో రాణించడానికి సిలికాన్ క్యాప్‌ను స్విమ్మర్లు వాడుతున్నారు. మైఖేల్ ఫెల్ప్స్, కాటీ లెడెకీ వంటి మేటి స్విమ్మర్లు రెండు క్యాప్స్‌ను ధరిస్తున్నారంటే, వాటి వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందనేది వాస్తవం.