ఆటాపోటీ

ఇద్దరూ ఇద్దరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటిష్ అథ్లెట్లు జాసన్ కెన్నీ, లారా ట్రాట్ అద్వితీయ ప్రతిభతోనేకాదు.. ఒకరి కోసం ఒకరుగా నిలిచే జంటగానూ అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్ మహిళల సైక్లింగ్ టీం పర్స్యూట్, ఒమ్నియమ్ విభాగాల్లో స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్న ట్రాట్ రియోలోనూ అదే ఫీట్‌ను పునరావృతం చేసి, బ్రిటిష్ అత్యుత్తమ క్రీడాకారిణిగా చరిత్ర పుటలోకి ఎక్కింది. అదే విధంగా జాసన్ 2008 బీజింగ్ ఒలింపిక్స్ సైక్లింగ్ పోటీల్లో పాల్గొని, టీమ్ స్ప్రింట్‌లో స్వర్ణం, ఇండివిజువల్ స్ప్రింట్‌లో కాంస్య పతకాలను గెల్చుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో టీం స్ప్రింట్, ఇండివిజువల్ స్ప్రింట్ ఈవెంట్స్‌లో స్వర్ణాలను సాధించాడు. రియోలో ఈరెండు ఈవెంట్స్‌తోపాటు కీరిన్ విభాగంలోనూ విజేతగా నిలిచాడు. బ్రిటిష్ చరిత్రలోనే అత్యుత్తమ అథ్లెట్ల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించారు. రియోలో కీరిన్ ఫైనల్‌లో టైటిల్ సాధించిన జాసన్ కెన్నీని చూసి ట్రాట్ ఆనందంతో బిగ్గరగా రోదించడం ప్రత్యేకతను సంతరించకుంది. ఇద్దరూ సైక్లిస్టులే కావడం, ఇద్దరూ బ్రిటిష్ మేటి అథ్లెట్ల జాబితాలో నంబర్ వన్ స్థానంలో నిలవడంతో త్వరలోనే వివాహం చేసుకోబోతున్న వీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా నిలుస్తారని అభిమానులు ముక్తకంఠంతో అంటున్నారు.