ఆటాపోటీ

సడలని ఆత్మవిశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒలింపిక్స్ పురుషుల వాల్ట్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో తీవ్రంగా గాయపడి, శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ ఫ్రెంచ్ జిమ్నాస్ట్ సమీర్ అయిత్ సరుూద్ ఆత్మవిశ్వాసం ఏమాత్రం సడలలేదు. ఎడమ మోకాలి కింద భాగంలో రెండు చోట్ల ఎముక విరగడంతో శస్తచ్రికిత్స జరిగిందని అతను ఆసుపత్రి నుంచి పోస్ట్ చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నాడు. గాయం తీవ్రమైనదేనని, అయితే, తన కెరీర్‌కు తెరపడిందని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటానని ధీమా వ్యక్తం చేశాడు. వాల్ట్ క్వాలిఫయర్స్ మొదటి ప్రయత్నంలోనే ఫైనల్స్‌కు అర్హత సంపాదించిన సమీర్ తన చివరి ప్రయత్నంలో గాయపడ్డాడు. ల్యాండింగ్ సక్రమంగా లేకపోవడంతో ఎడమ మోకాలు పూర్తిగా వెనక్కు తిరిగిపోయింది. అధికారులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి రెండు శస్తచ్రికిత్సలు జరిపినట్టు వైద్యులు ప్రకటించారు. ల్యాండింగ్‌లో పొరపాటు జరిగి, కాలు విరిగినప్పుడు తాను కేకలు పెట్టలేదని, అయితే, ఈ పోటీల్లో కొనసాగడం అసాధ్యమని అర్థమైన వెంటనే మరో నాలుగేళ్లలో జరిగే టోక్యో ఒలింపిక్స్ గురించే ఆలోచించానని తన వీడియో సందేశంలో సమీర్ పేర్కొన్నాడు. తనను స్ట్రెచర్‌పై స్టేడియం బయటకు తీసుకెళుతున్నప్పుడు ప్రేక్షకులంతా లేచినిలబడ్డారని, ఒలింపిక్స్ స్ఫూర్తికి ఇంతకంటే నిదర్శనం ఉండదని తెలిపాడు. వేగంగా కోలుకొని తన కాళ్లమీద తాను నిలబడతానని, సాధ్యమైనంత త్వరగా మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెడతానని చెప్పాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే తన తోటి జిమ్నాస్టులకు మద్దతు పలికేందుకు వెళతానని చెప్పాడు. గాయపడిన తనను పరామర్శిస్తూ వేలాది సందేశాలు వచ్చాయని, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని సమీర్ తెలిపాడు. అందరి అభిమానమే తనను త్వరగా కోలుకునేలా చేస్తుందని అన్నాడు.