ఆటాపోటీ

ఎక్కుపెట్టిన బాణం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించిన ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ జిమ్ లేకర్ పుస్తకం ‘ఓవర్ టు మి’ అప్పట్లో పెను తుపానుకు కారణమైంది. ఇంగ్లాండ్ క్రికెట్‌లో నెలకొన్న అవినీతి, అక్రమాలపై ఎక్కుపెట్టిన బాణం అతని పుస్తకం. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన లేకర్ సహజంగానే క్రికెట్ పెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. అసాధారణ ప్రతిభావంతుడైనప్పటికీ జాతీయ జట్టులోనేకాదు.. కౌంటీ జట్టులోనూ స్థానం కోల్పోయాడు. చాలా మంది క్రికెటర్లపై అతను వాడిన పదజాలం, చేసిన ఆరోపణలు అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శలు చెలరేగాయి. ఒక పుస్తకంలో వాడకూడని భాషను వాడాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తీవ్ర స్థాయిలో వివాదాలు సృష్టించినప్పటికీ, లేకర్ పుస్తకం అమ్మకాలు సంతృప్తికరంగా సాగలేదు. ఇంగ్లాండ్ క్రికెటర్లు, అధికారులు ఈ పుస్తకం అమ్మకాలను అడ్డుకున్నారన్న వాదన కూడా ఉంది.

- సత్య