ఆటాపోటీ

గురితప్పిన షూటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు అత్యధిక పతకాలు షూటింగ్ పోటీల్లోనే లభిస్తాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎంతో మంది స్టార్ షూటర్లు పోటీకి వెళ్లడమే అందుకు కారణం. కానీ, కాగితాలపై సమర్థులుగా కనిపించే వారంతా గురితప్పడంతో షూటింగ్‌లో నిరాశ తప్పలేదు. అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, జీతూ రాయ్, గుర్‌ప్రీత్ సింగ్, ప్రకాష్ నంజప్ప, చైన్ సింగ్, మానవ్‌జిత్ సింగ్, క్యాన్ చెనయ్, మైరాజ్ అహ్మద్ ఖాన్, అపూర్వీ చండీలా, అయోనికా పాల్, హీనా సిద్ధు వైఫల్యాలు మొదటి నుంచి చివరి వరకూ కొనసాగాయి.

అథ్లెటిక్స్‌లో మరీ ఘోరం
అథ్లెటిక్స్‌లో మన దేశానికి ఎప్పుడూ పరాజయాలు.. పరాభవాలే. రియో ఒలింపిక్స్‌లోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. మహిళల 3,000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో లలితా బాబర్ ఫైనల్స్‌కు వెళ్లి ఆశలు పెంచినప్పటికీ, 10 స్థానంతో రేస్‌ను ముగించింది. దుతీ చంద్ (100 మీటర్లు), శ్రావణి నందా (200 మీటర్లు), నిర్మలా షరాన్ (400 మీటర్లు), టింటూ లుకా (800 మీటర్లు), మన్‌ప్రీత్ కౌర్ (షాట్‌పుట్), కుష్బీర్ కౌర్, స్వప్నా పునియా (20 కిలోమీటర్ల నడక), వికాస్ గౌడ (డిస్కస్ త్రో), జిన్సన్ జాన్సన్ (800 మీటర్లు), మహమ్మద్ అనాస్ యహియా (400 మీటర్లు), అంకిత్ శర్మ (లాంగ్ జంప్), రెంజిత్ మహేశ్వరి (ట్రిపుల్ జంప్), గుర్మీత్ సింగ్, మనీష్ సింగ్ రావత్, గణపతి కృష్ణన్ (20 కిలోమీటర్ల నడక), సందీప్ కుమార్ (50 కిలోమీటర్ల నడక), గోపీ (పురుషుల మారథాన్) క్వాలిఫయర్స్ అడ్డంకిని దాటకలేపోయారు. మహిళలు, పురుషుల 400 మీటర్ల రిలే జట్లు కూడా విఫలమయ్యాయి. మహిళల మారథాన్‌లో పాల్గొన్న ఒపి జైషకు మంచినీళ్లు అందించే వారు కూడా కరవయ్యారంటే, భారత బృందంలోని అధికారులు ప్రవర్తించిన తీరు ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు.

హాకీలో గత వైభవమే
హాకీలో గత వైభవమే తప్ప ప్రస్తుత పరిస్థితి ఏమాత్రం ఆశా జనకంగా లేదు. పురుషుల విభాగంలో భారత జట్టు క్వార్టర్స్‌లో బెల్జియం చేతిలో ఓడింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో చిట్టచివరి స్థానంలో నిలిచిన భారత్ ఈసారి క్వార్టర్స్ చేరడం ఒక్కటే ఊరటనిచ్చిన అంశం. ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హతను 36 సంవత్సరాల తర్వాత మొదటిసారి సంపాదించిన భారత్ నాలుగు పరాజయాలను చవిచూసి, ఒక మ్యాచ్‌ని డ్రా చేసుకొని లీగ్ దశ నుంచే నిష్క్రమించింది.