ఆటాపోటీ

ఖర్చుపై చర్చ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో ఒలింపిక్స్ ముగిసిన తర్వాత దాదాపు అన్ని దేశాలు క్రీడాకారులపై పెట్టిన ఖర్చును, సాధించిన విజయాలను బేరీజు వేసుకోవడం ఆరంభించాయి. ఎంత ఖర్చు పెడితే, ఎంత లాభం వచ్చిందనే చర్చ అన్ని దేశాల్లోనూ మొదలైంది. అమెరికా 46 స్వర్ణాలు, 37 రజతా, 38 కాంస్యాలతో మొత్తం 121 పతకాలు సాధించింది. బ్రిటన్ 27 స్వర్ణాలు, 23 రజతాలు, 17 కాంస్యాల సాయంతో 67 పతకాలను కైవసం చేసుకొని రెండో స్థానంలో నిలిచింది. చైనా 26 స్వర్ణం, 18 రజతం, 26 కాంస్యాలతో 70 పతకాలను గెల్చుకొని, మూడో స్థానాన్ని ఆక్రమించింది. క్రీడల కోసం అమెరికా అత్యధికంగా, ఏటా సుమారు 16,759 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. 2012 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన బ్రిటన్‌లో ఒలింపిక్స్‌కు అథ్లెట్లను సిద్ధం చేయడానికి చేసిన ఖర్చు, వచ్చిన ఫలితాలను బేరీజు వేస్తూ, లాభనష్టాల చర్చ జోరందుకుంది. గత నాలుగేళ్లలో క్రీడల కోసం 2,747 కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్టు బ్రిటన్ అంటున్నది. ఈ మొత్తాన్ని 3,082 కోట్లుగా భారత షూటర్ అభినవ్ బింద్రా ట్వీట్ చేశాడు. బ్రిటన్ అధికారిక లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటే, ఒక్కో పతకానికి చేసిన వ్యయం సుమారు 41 కోట్ల రూపాయలు. ఇన్ని పతకాలను సాధించినా, పట్టికలో అమెరికా తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించినా బ్రిటన్ పౌరులు పూర్తిగా సంతృప్తి చెందినట్టు కనిపించడం లేదు. క్రీడల కోసం చేసిన ఖర్చు వల్ల తమపై ఏడాదికి 1,090 రూపాయల భారం పడుతున్నదని వాపోతున్నారు. పతకాల సంఖ్య పెరిగి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. లండన్‌లో 2012 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చినందువల్లే బ్రిటన్‌కు 65 పతకాలు దక్కాయన్న వాదన ఉంది. అయితే, ఆ విమర్శల్లో అర్థం లేదని రియోలో బ్రిటన్ నిరూపించింది. లండన్‌లో 65 పతకాలు సాధిస్తే, రియోలో మరో రెండు పతకాలను అదనంగా కైవసం చేసుకుంది. కాబట్టి, బ్రిటన్ చేసిన ఖర్చుకు తగిన ప్రతిఫలం లభించిందనే చెప్పాలి. కానీ, భారత్ ఇలాంటి లక్ష్యాలకు దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. కేవలం రెండు పతకాలతో ఒలింపిక్స్‌ను ముగించింది. ఖర్చు విషయానికి వస్తే, గత నాలుగేళ్ల కాలంలో శిక్షణ కేంద్రాలు, కోచ్‌లు, వౌలిక సదుపాయాల కల్పనకు భారత ప్రభుత్వం 750 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జాతీయ క్రీడాభివృద్ధి నిధి ద్వారా 22.7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్) కార్యక్రమంలో 38 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. మొత్తం మీద రియో ఒలింపిక్స్‌లో పతకాల కోసం మన దేశం వెచ్చించింది అక్షరాలా 810 కోట్ల రూపాయలు. దక్కించుకున్నది కేవలం రెండు పతకాలు. అంటే, ఒక్కో పతకానికీ 405 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఇదంతా ప్రజా ధనమే అన్నది తిరుగులేని నిజం. ప్రజలపై పెను భారాన్ని మోపి, లెక్కల పుస్తకాల్లో ఖర్చులను చూపిన అధికారులు వాస్తవంగా నిధులను ఖర్చు చేశారా? లేక అవినీతి జరిగిందా? నిధులు పక్కదారి పట్టాయి. ఎవరికివారే భారీగా సొమ్మును నొక్కేశారా? సామాన్యుడు ఇలాంటి ప్రశ్నలు సంధించడంలో తప్పులేదు. ఖర్చు పెడితే ఫలితం ఎందుకు దక్కలేదో అధికారులే చెప్పాలి. ఫలితం లేని ఖర్చు ఎందుకు చేశారో వివరించాలి.