ఆటాపోటీ

పతకానికి గండికొట్టిన ‘సాయ్’ నిర్లక్ష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) అధికారుల నిర్లక్ష్యమే రియో పారాలింపిక్స్ పురుషుల ఎఫ్-46 జావెలిన్‌త్రో ఈవెంట్‌లో భారత్‌కు మరో పతకం రాకుండా అడ్డుకుందనే విమర్శలు జోరందుకున్నాయి. ఈ పోటీల్లో దేవేంద్ర ఝజారియా 63.97 మీటర్ల దూరానికి జావెలిన్‌ను విసిరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. అయితే, ఇదే విభాగంలో పోటీపడాల్సిన సుందర్ సింగ్ గుజ్రార్ గైర్హాజరయ్యాడు. దేవేంద్ర తన త్రోతో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పి స్వర్ణాన్ని అందుకున్నప్పటికీ, సుందర్ బరిలోకి దిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అతను ప్రాక్టీస్ సమయంలో చాలాసార్లు 70 మీటర్ల దూరానికి జావెలిన్‌ను విసిరాడు. పోటీలో అతను ఉండివుంటే, రికార్డుతోపాటు స్వర్ణం ఖాయంగా అతనికే దక్కేదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. ఇంతకీ సుందర్ ఎందుకు సకాలంలో రాలేకపోయాడన్న ప్రశ్నకు అంతా సమాధానలు వెతుక్కోవడంలో నిమగ్నమయ్యారు. ఈ విభాగంలో భారత్ నుంచి మొత్తం ముగ్గురు పోటీపడాల్సి ఉండింది. దేవేంద్రతోపాటు రింకూ హూడా, సుందర్ కూడా ప్రాక్టీస్ ఎరినాకు వెళ్లాడు. అందరితో కలిసి అభ్యాసం చేశాడు. పోటీ ఆరంభానికి ముందు వామప్ అయ్యాడు. కానీ, నిర్వాహకులు పోటీదారుల పేర్లు పిలిచినప్పుడు వెళ్లలేదు. మిగతా ఇద్దరు, దేవేంద్ర, రింకూ వెళ్లినప్పటికీ సుందర్ ఎందుకు ప్రాక్టీస్ ఎరినాలోనే ఉండిపోయాడన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిర్వాహకులు రెండుసార్లు పేర్లు పిలిచినప్పటికీ అతను పోటీకి హాజరుకాలేదు. పోటీ ముగిసి, దేవేంద్ర విజయోత్సవాన్ని జరపుకొంటున్న సమయంలో సుందర్‌కు అసలు విషయం తెలిసింది. వార్త విన్న వెంటనే స్పృహ కోల్పోయిన అతనిని క్రీడా గ్రామంలోని ఆసుపత్రికి తరలించారు. ఇరవై నాలుగు గంటల తర్వాత అతను స్పృహలోకి వచ్చాడు. సాయ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తనకు స్వర్ణ పతకాన్ని సాధించే అవకాశం చేజారిపోయిందని ఒక చాలెన్‌తో మాట్లాడుతూ వాపోయాడు. కోచ్ దీపక్ భరద్వాజ్ కూడా తనను మోసం చేశాడని సుందర్ ఆరోపించాడు. ‘నాకు ఇంగ్లీషు మాట్లాడడం రాదు. ఆ భాషను చదవలేను. రాయలేను. దీనితో పూర్తిగా సాయ్ అధికారులపైనే ఆధారపడాల్సి వచ్చింది. పోటీదారులను హాజరుకావాల్సిందిగా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు మిగతా ఇద్దరికీ సమాచారం అందించిన కోచ్ దీపక్ నాకు విషయాన్ని తెలపలేదు. కనీసం పోటీ స్థలానికి వెళుతున్నప్పుడు కూడా నా గురించి పట్టించుకోలేదు. ఈ విభాగంలో నేనే అత్యుత్తమ అథ్లెట్‌ననే విషయం అందరికీ తెలుసు. 70 మీటర్ల దూరానికి నేను చాలాసుర్లు జావెలిన్‌ను విసిరిన విషయం కూడా అధికారులకు తెలుసు. కానీ, నాకు సమాచారం కూడా ఇవ్వకుండా అంతా కలిసి అన్యాయం చేశారు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సాయ్ అధికారుల నిర్వాకమే భారత్‌కు రియో పారాలింపిక్స్ జావెలిన్ త్రోలో మరో పతకం లభించే అవకాశానికి గండికొట్టింది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినప్పటికీ, సుందర్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.