ఆటాపోటీ

అమర్‌నాథ్ ఒక్కడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహీందర్ అమర్‌నాథ్ 1983లో ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టులో సభ్యుడు. కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా వరల్డ్ కప్‌ను గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. అతను అత్యంత అరుదైన రికార్డును కూడా తన సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ‘హ్యాండ్లింగ్ ది బాల్’, ‘అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’గా అవుటైన ఏకైక క్రికెటర్‌గా అతని పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది. 1986 ఫిబ్రవరి 9న మెల్బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డలో ఆడుతూ అతను బంతిని డిఫెన్స్‌గా ఆడాడు. అయితే అది కిందపడిన వెంటనే వికెట్ల దిశగా వెళ్లింది. అమర్‌నాథ్ అప్రయత్నంగానే దానిని చేత్తో దూరంగా నెట్టేశాడు. ‘హ్యాండ్లింగ్ ది బాల్’గా అవుటైనట్టు అంపైర్ ప్రకటించిన వెంటనే అతను నవ్వుకుంటూ పెవిలియన్‌కు వెళ్లాడు. 1989లో శ్రీలంకతో అహ్మదాబాద్‌లో జరిగిన టెస్టులో ఫీల్డర్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నాడన్న కారణంగా అతనిని అవుట్‌గా ప్రకటించారు. ఈ విధంగా ‘హ్యాండ్లింగ్ ది బాల్’, ‘అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’ వంటి రెండు కారణాలతో మరే ఆటగాడు అవుట్ కాలేదు.
కీపర్లలో టాపర్ ధోనీ
భారత వికెట్ కీపర్లలో ఎక్కువ మందిని అవుట్ చేసిన రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉంది. అతని ఖాతాలో 294 డిస్మిసల్స్ ఉన్నాయి. వీటిలో 256 క్యాచ్‌లుకాగా, 38 స్టంపింగ్స్‌లు. సయ్యద్ కిర్మాణీ 198, కిరణ్ మోరే 130 డిస్మిసల్స్‌లో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను ఆక్రమించారు. ‘టాప్-10’ జాబితాలో నయన్ మోంగియా (107), ఫరూఖ్ ఇంజనీర్ (82), నరేన్ తంహానే (51), దినేష్ కార్తీక్ (50), పార్థీవ్ పటేల్ (49), ఖోకన్ సేన్ (31), వృద్ధిమాన్ సాహా (30) ఉన్నారు. సాహా కివీస్‌తో సిరీస్‌లో వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్‌గా సేవలు అందిస్తాడు.
టాప్ స్కోరర్ సెవాగ్
ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో మొదటి మూడు స్థానాలను వీరేందర్ సెవాగ్ ఆక్రమించాడు. అతను దక్షిణాఫ్రికాపై చెన్నైలో 319 (చెన్నై/ 2008), పాకిస్తాన్‌పై 309 (ముల్తాన్/ 2004), శ్రీలంకపై 293 (ముంబై/ 2009) చొప్పున పరుగులు చేశాడు. వివిఎస్ లక్ష్మణ్ 2001లో ఆస్ట్రేలియాపై కోల్‌కతాలో 281, రాహుల్ ద్రవిడ్ 2004లో పాకిస్తాన్‌పై రావల్పిండిలో 270 చొప్పున పరుగులు సాధించి ‘టాప్-5’లో చోటు సంపాదించారు.
పాక్ తరఫున సచిన్!
భారత ‘లెజండరీ క్రికెటర్’ సచిన్ తెండూల్కర్ గురించి తెలియని వారు తక్కువ. అయితే, అతను ఒకసారి పాకిస్తాన్ తరఫున మైదానంలోకి దిగాడని చాలా మందికి తెలియదు. కానీ, ఇది నిజం. 1987లో పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య బ్రబౌర్న్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. పాక్ ఫీల్డర్ విశ్రాంతి కోసం డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లడంతో, ఆ జట్టు తరపున సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా సచిన్ కొంత సేపు ఆడాడు.
టెస్టుల్లో ఎక్కువసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న భారత క్రికెటర్లలో సచిన్ తెండూల్కర్ నంబర్ వన్. అతను 14 పర్యాయాలు ఈ అవార్డును స్వీకరించాడు. రాహుల్ ద్రవిడ్ 11, అనీల్ కుంబ్లే 10 అవార్డులతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు. పది లేదా అంతకంటే ఎక్కువ పర్యాయాలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న భారత క్రికెటర్లు వీరే.
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల విషయంలో సచిన్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలుస్తాడు. రవిచంద్రన్ అశ్విన్‌కు ఆరు పర్యాయాలు ఈ అవార్డు లభించింది. సచిన్, సెవాగ్ చెరి ఐదుసార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచారు.
ఓటమి లేకుండా..
భారత జట్టు 1985-1987 మధ్యకాలంలో ఒక్క ఓటమి కూడా లేకుండా 17 టెస్టులు ఆడింది. వీటిలో నాలుగు విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. 12 టెస్టులు డ్రా అయ్యాయి. ఈ అజేయ రికార్డుకు పాకిస్తాన్‌తో బెంగళూరులో జరిగిన టెస్టుతో తెరపడింది. టీమిండియా ఓడిన ఆ మ్యాచ్ సునీల్ గవాస్కర్‌కు కెరీర్‌లో చివరి టెస్టు కావడం విశేషం.
బాపూ నాద్కర్ణి 1964లో ఇంగ్లాండ్‌తో మద్రాసు (ఇప్పటి చెన్నై)లో జరిగిన టెస్టులో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఏకంగా 131 బంతులు బౌల్ చేసి, రికార్డు సృష్టించాడు.
ఆస్ట్రేలియా బ్యాటింగ్ లెజండ్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను స్టంప్ చేసిన ఘనత ఒక్కరికే దక్కింది. బెంగాల్‌కు చెందిన ప్రబీర్ సేన్ అతనిని స్టంప్ అవుట్ చేసిన ఏకైక వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు.
టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత మొదటి మూడు మ్యాచ్‌ల్లోనూ శతకాలు సాధించిన ఏకైక ఆటగాడు మహమ్మద్ అజరుద్దీన్. తర్వాతి కాలంలో అతను భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

చిత్రం..మొహీందర్ అమర్‌నాథ్