ఆటాపోటీ

బోర్డు ఎత్తుగడలపై ఆదిత్య వర్మ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)ని కోర్టుకు ఈడ్చి, ఒక రకంగా లోధా కమిటీ ఏర్పాటుకు కారణమైన ఆదిత్య వర్మ తన లక్ష్యం నెరవేరే వరకూ విశ్రమించకూడదన్న నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా తప్పించుకోవడానికి బిసిసిఐ వేస్తున్న ఎత్తుగడలపై అతను దృష్టిపెట్టాడు. ఈ విషయంపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశాడు. బిసిసిఐ రద్దు చేసిన బీహార్ క్రికెట్ సంఘానికి కార్యదర్శిగా ఉన్న వర్మ మారుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాడు. ఈనెల 17న సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తుందన్న వార్తల నేపథ్యంలో అతను బోర్డు ఎత్తుగడలను అంచనా వేయడంలో నిమగ్నమయ్యాడు. ఐపిఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కేసును, బిసిసిఐలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టిన వర్మ బాంబే హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో పలు కేసులు వేసిన విషయం తెలిసిందే. అతని ప్రయత్న ఫలితంగానే భారత క్రికెట్ పారదర్శకంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చిన సుప్రీం కోర్టు తగిన సూచనలు ఇవ్వడానికి లోధా కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికలోని ప్రతిపాదనలను అమలు చేయడానికి వెనుకంజ వేస్తున్న బిసిసిఐ తాజాగా ప్రభుత్వ ప్రతినిధులను ఆశ్రయించి, వారి ద్వారా కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని ప్రధానికి రాసిన లేఖలో వర్మ ఆందోళన వ్యక్తం చేశాడు. లోధా కమిటీ సిఫార్సుల్లో ఎక్కడా బిసిసిఐపై ప్రభుత్వ ఆజమాయిషీకి ఆస్కారం లేదని స్పష్టం చేశాడు. క్రీడా బిల్లును ఆమోదిస్తే తప్ప, బిసిసిఐపై కేంద్రానికి పట్టు సాధ్యం కాదని స్పష్టం చేశాడు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని, పకడ్బందిగా క్రీడా బిల్లును రూపొందించి, పార్లమెంటులో ఆమోదింప చేయాలని కోరాడు.