ఆటాపోటీ

బ్లాటర్ ‘ఆఖరి యుద్ధం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమస్య (్ఫఫా) మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ ఆఖరి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటున్న అతను క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్)లో తుది పోరాటం చేస్తున్నాడు. ఫిఫాకు కొత్త అధ్యక్షుడిగా గియానీ ఇన్‌ఫాంటినో ఎన్నిక చెల్లదని, తనపై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని అతను డిమాండ్ చేస్తున్నాడు. ఫిఫా అధ్యక్ష ఎన్నిక అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొనసాగింది. ఆ పదవికి ఎన్నికైన కొద్ది రోజులకే బ్లాటర్ రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సాకర్ ప్రపంచ కప్ నిర్వాహణ హక్కులను ఇవ్వడానికి భారీగా ముడుపులు స్వీకరించారంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతున్నందున అతను పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకూ తాను అధ్యక్ష స్థానంలో కొనసాగుతానని అతను ప్రకటించాడు. కానీ, ఫిఫా క్రమశిక్షణ ప్యానెల్ అతనిపై ఆరేళ్ల సస్పెన్షన్‌ను విధించింది. అతనితోపాటు, అప్పట్లో యూఫా అధ్యక్షుడిగా ఉన్న మైఖేల్ ప్లాటినీపైనా వేటు వేసింది. ఫలితంగా, అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్లాటినీ వైదొలగ్గా ఇన్‌ఫాంటినో రంగంలోకి దిగాడు. ఐరోపా ఖండానికి చెందిన అతను ఈ రేసులో గట్టిపోటీదారు షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం ఖలీఫాను 27 ఓట్ల తేడాతో ఓడించాడు. బ్లాటర్ వారసుడిగా, ఫిఫాకు 10వ అధ్యక్షుడిగా అవతరించాడు. బ్లాటర్ మాదిరే ఇన్‌ఫాంటినో కూడా స్విట్జర్లాండ్‌కు చెందిన వాడు కావడం విశేషం. ఎన్నికల్లో ఇబ్రహీం ఖలీఫా విజయం ఖాయమని చివరి క్షణం వరకూ అంతా జోస్యం చెప్పారు. కానీ, ఆ అంచనాలు తారుమారయ్యాయి. ఇన్‌ఫాంటినో 115 ఓట్లు దక్కించుకున్నాడు. ఎన్నికలకు కొన్ని క్షణాల వరకూ పోటీలో ఉన్న టోక్యో సెక్స్‌వేల్ హఠాత్తుగా తాను పోటీలో లేనని ప్రకటించాడు. అప్పటికే పోటీపడుతున్న అభ్యర్థుల జాబితాలో అతని పేరు ఉండగా, ఓటింగ్‌కు కొన్ని గంటల ముందు తాను వైదొలగుతున్నట్టు సెక్స్‌వేల్ ప్రకటించడం విశేషం. నిర్ణయాత్మకమైన రెండో రౌండ్ ఓటింగ్‌లో ఇన్‌ఫాంటినోకు 115 ఓట్లు లభించగా, ఇబ్రహీం అల్ ఖలీపా 88 ఓట్లు సాధించాడు. ప్రిన్స్ అలీ బిన్ అల్ హుస్సేన్‌కు రెండో రౌండ్‌లో నాలుగు ఓట్లు దక్కాయి. గతంలో ఫిఫా అధికారిగా సేవలు అందించిన జెరోమ్ చాంపేంజ్‌కు ఒక్క ఓటు కూడా రాలేదు. ఫిఫాలో మొత్తం 209 సభ్యదేశాలు ఉండగా, 207 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నిక తర్వాత బ్లాటర్ శకానికి తెరపడింది. ఫిఫాపై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించి, సుమారు పద్దెనిమి సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగిన అతను నిధుల దుర్వినియోగం ఆరోపణలను ఎదుర్కొంటూ, అత్యంత అవమానకరమైన రీతిలో ఆరేళ్ల సస్పెన్షన్‌కు గురై, మరోసారి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే అవకాశాలను కోల్పోయాడు. ప్రపంచంలోనే అత్యధిక మంది అభిమానులు, భారీగా నిధులు, రెండు వందలకు పైబడిన సభ్య దేశాలతో అత్యంత బలమైన క్రీడా సంస్థగా వెలిగిపోతున్న ఫిఫాను పగ్గాలు ఇన్‌ఫాంటినో చేతికి దక్కాయి. బ్లాటర్ తెరమరుగయ్యాడు.
ఫిఫాకు అధ్యక్షుడిగా మరోసారి ఎన్నిక కావడం కంటే, తనపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడి ‘మిస్టర్ క్లీన్’ ముద్ర వేయించుకోవడమే బ్లాటర్ ఆలోచనగా కనిపిస్తున్నది. 80 ఏళ్ల వయసులో అతను ఫిఫా అధ్యక్ష పదవిని చేపట్టడం దాదాపు అసాధ్యం. తాను బరిలోకి దిగడం ఇదే చివరిసారని, భవిష్యత్తులో పోటీ చేయబోనని బ్లాటర్ ఎన్నికలకు ముందే ప్రకటించాడు. కానీ, ఎన్నికైన కొన్ని రోజుల వ్యవధిలోనే అతను రాజీనామా చేయాల్సి వచ్చింది. సిఎఎస్‌లో విచారణ ముగిసి, తీర్పు తనకు అనుకూలంగా వచ్చినా, బ్లాటర్ మరోసారి ఫిఫా అధ్యక్ష పదవికి పోటీ చేయకపోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం అతను పరువు కోసం పాకులాడుతున్నాడు. ఆ ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.