ఆటాపోటీ

మంత్రులకు నో ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రులు ఎవరూ బిసిసిఐ పాలక మండలిలో సభ్యులుగా ఉండరాదు. బోర్డు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి తదితర పోస్టులకు ఎన్నికయ్యే వ్యక్తులకు కొన్ని స్పష్టమైన అర్హతలు ఉండాలి. వీరు భారతీయులై ఉండాలి. వయసు 70 సంవత్సరాలకు మించరాదు. మంత్రిగా లేదా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండకూడదు.
కార్యవర్గ సభ్యులకు సీలింగ్ ఉండాలి. ఒక వ్యక్తి బిసిసిఐ పాలక మండలికి గరిష్టంగా మూడు సార్లు ఎన్నికకావచ్చు. అంతకంటే ఎక్కువ పర్యాయాలు లేదా తొమ్మిది సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పదవిలో కొనసాగరాదు. పాలక మండలి మూడేళ్లు పదవిలో ఉండవచ్చు. అయితే, అధ్యక్షుడు రెండుసార్లు, మిగతా కార్యవర్గ సభ్యులు వరుసగా రెండు పర్యాయాలు, మొత్తం మీద మూడు పర్యాయాల కంటే అధికంగా పదవిలో కొనసాగేందుకు వీలులేదు. రెండేళ్ల తర్వాత తీసుకునే విరామాన్ని ‘కూలింగ్ ఆఫ్’గా లోధా కమిటీ పేర్కొంది.
బోర్డు అధ్యక్షుడికి మూడు ఓట్లు ఉండడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. ప్రస్తుత నిబంధనలను అనుసరించి బిసిసిఐ అధ్యక్షుడు మూడు ఓట్లు వేసే అవకాశం ఉంది. తాను ప్రాతినిథ్యం వహించే క్రికెట్ సంఘం తరఫున ఒకటి, బోర్డు అధ్యక్షుడి హోదాలో మరొకటి ఓటు ఉంటుంది. ఏదైనా అంశంపై ఓట్లు సమానంగా పోలైతే, కాస్టింగ్ ఓటు వేసే అధికారం కూడా అధ్యక్షుడికి ఉంది. ఒక వ్యక్తికి ఈ విధంగా మూడు ఓట్లు వేసే అధికారం ఇవ్వడం ప్రజాస్వామిక విధానాలకు గొడ్డలిపెట్టు. సంబంధిత క్రికెట్ సంఘం తరఫున ఒక ఓటు ఉంటే చాలు.