ఆటాపోటీ

రెండు పడవల ప్రయాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలిప్పీన్స్ బాక్సింగ్ హీరో మానీ పాక్వియావో రెండు పడవలపై ప్రయాణం సాగిస్తున్నాడు. బాక్సింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత మనసు మార్చుకున్న అతను మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నాడు. మరోవైపు ఫిలిప్పీన్స్ పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందిస్తున్నాడు. నవంబర్ 5న లాస్ వెగాస్‌తో అతను వరల్డ్ బాక్సింగ్ సంఘం (డబ్ల్యుబిఎ) వెల్టర్‌వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైట్‌లో జెస్సీ వెర్గాన్‌తో తలపడతాడు. ప్రస్తుతానికి ఈ బౌట్ మీదే దృష్టి కేంద్రీకరిస్తున్నానని, అందుకే, భవిష్యత్తు గురించి ఇప్పుడే చెప్పలేనని పాక్వియావో అంటున్నాడు. ఫిలిప్పీన్స్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న అతనిని భవిష్యత్ ప్రధానిగా రాజకీయ విశే్లషకులు అభివర్ణిస్తున్నారు. పార్లమెంటుకు పోటీ చేసే ఎన్నికైన అతను ఎక్కువ సమయాన్ని ప్రజా సేవలోనే గడుపుతున్నాడు. అయితే, రిటైర్మెంట్ నిర్ణయాన్ని పక్కకుపెట్టి, హఠాత్తుగా మళ్లీ బాక్సింగ్ రింగ్‌వైపు పరుగులు తీస్తున్నాడు. భవిష్యత్తు గురించి ఇప్పుడే చెప్పలేనని అంటున్న 37 ఏళ్ల పాక్వియానో, అదే తన చివరి బౌట్ అని కూడా స్పష్టం చేయలేకపోతున్నాడు. కెరీర్, రాజకీయాల్లో దేనినీ వదులుకోవడానికి పాక్వియావో సిద్ధంగా లేడని అతని సన్నిహితులు అంటున్నారు. అందులో ఎంత వరకు నిజం ఉందో నవంబర్ ఐదు తర్వాత స్పష్టమవుతుంది. అప్పటి వరకూ సస్పెన్స్ కొనసాగుతునే ఉంటుంది.
ఓటమి ఎరుగని వీరుడు ఫ్లోయిడ్ మేవెదర్‌తో పాక్వియావో తలపడే అవకాశాలు ఉన్నాయన్న వార్త అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నది. మేవెదర్‌తో పోరాడి ఓటిన తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన పాక్వియావో హఠాత్తుగా రీ మ్యాచ్‌కి సిద్ధమని ప్రకటించాడు. మేవెదర్‌తో నిరుడు మే మాసంలో ఫైట్‌కు దిగి, ఓడిపోయిన తర్వాత తాను కెరీర్‌ను కొనసాగించే అవకాశం లేనేలేదని స్పష్టం చేసిన పాక్వియావో మాట మార్చడంతో, వీరిద్దరి మధ్య ఫైట్ ఎప్పుడు ఉంటుందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పాక్వియావోతో ఫైట్ తర్వాత తాను గతంలో కుదుర్చుకున్న కాంట్రాక్టును అనుసరించి తిమోతీ బ్రాడ్లీతో మేవెదర్ చివరి ఫైట్ చేశాడు. అందులోనూ విజయం సాధించాడు. ఓటమి ఎరుగని వీరుడిగా తనకు ఉన్న రికార్డుతోనే అతను కెరీర్‌ను ముగించాడు. మొత్తం మీద పాక్వియావో, మేవెదర్ ఇద్దరూ బాక్సింగ్‌కు గుడ్‌బై చెప్పినప్పటికీ, వారిద్దరి మధ్య జరిగిన చివరి ఫైట్‌ను ఇప్పటికీ అభిమానులు గుర్తుచేసుకుంటునే ఉన్నారు. నిజానికి హోరాహోరీ పోరు సాగుతుందని అందరూ ఊహించినప్పటికీ, ఫైట్ అందుకు భిన్నంగా సాగింది. మేవెదర్ ముందు నిలవలేకపోయిన పాక్వియావో కనీస ప్రతిఘటన కూడా లేకుండానే చిత్తయ్యాడు. ఇది అసలుసిసలైన ఫైట్ కాదని, ఫిక్సింగ్ జరిగి ఉంటుందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. టికెట్ల కోసం తాము వెచ్చించిన మొత్తాన్ని వాపసు ఇవ్వాలంటూ ప్రేక్షకులు ఆందోళనలు కూడా చేశారు. పాక్వియావో ఎక్కడికి వెళ్లినా, మేవెదర్‌తో జరిగిన ఫైట్‌ను గుర్తుచేయడం మీడియాకు, బాక్సింగ్ అభిమానులకు అలవాటుగా మారింది. ఇటీవల ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి పాక్వియానో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా విలేఖరులు, అభిమానులు పదేపదే మేవెదర్‌తో జరిగిన ఫైట్ గురించి ప్రస్తావించారు. దీనిపై పాక్వియానో స్పందిస్తూ రిటైర్మెంట్ నిర్ణయాన్ని పక్కకుపెట్టి, మేవెదర్‌తో రీ-బౌట్‌కు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. మేవెదర్ ఫైట్‌కు అంగీకరిస్తాడా? లేదా? అన్నది తనకు సంబంధం లేదంటున్నాడు.

చిత్రం.. మానీ పాక్వియావో